Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నువ్వు తోపు రా తమ్ముడు'

ఐపీఎల్ 2026 సీజన్లో భాగం శనివారం రాత్రి లక్నో, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ మైలురాయిని అందుకున్న తమ్ముడిని చూసి సోదరి సారా టెండూల్కర్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. సోషల్ మీడియా వేదికగా ఆమె పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

తమ్ముడి కోసం సారా ఎమోషనల్ పోస్ట్
లక్నో జట్టు తరఫున స్టేడియంలోకి దిగిన అర్జున్ టెండూల్కర్ ప్రదర్శన చూసి సారా టెండూల్కర్ గర్వంతో ఉప్పొంగిపోయింది. మ్యాచ్ ముగిసిన అనంతరం అర్జున్ టెండూల్కర్ మైదానంలో వికెట్ తీసి సంబరాలు చేసుకుంటున్న ఫోటోను ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. దానికి ఒక అందమైన క్యాప్షన్ కూడా యాడ్ చేసింది. "నువ్వు ఈ ప్రపంచంలోని అన్ని సంతోషాలకు అర్హుడివి నా చిన్న తమ్ముడా! నీ కష్టపడే తత్వం, ఒత్తిడిని అధిగమించే నీ నైపుణ్యం, ఈ సుదీర్ఘ ప్రయాణంలో నువ్వు చూపించిన ఓపికను చూస్తే నాకు చాలా చాలా గర్వంగా ఉంది. లవ్ యు ఆల్వేస్" అంటూ సారా తన ప్రేమను కురిపించింది.

Sara Tendulkar Shares Emotional Post for Brother Arjun Tendulkar After His IPL 2026 Debut Details

సుదీర్ఘ నిరీక్షణకు తెర
సారా టెండూల్కర్ తన పోస్టులో పేర్కొన్నట్లుగా.. అర్జున్ టెండూల్కర్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కుమారుడిగా అతడిపై ఎప్పుడూ భారీ అంచనాలు, ఒత్తిడి ఉంటాయి. ఐపీఎల్‌లో మైదానంలోకి దిగే అవకాశం కోసం అర్జున్ టెండూల్కర్ గత కొంతకాలంగా ఎంతో ఓపికగా ఎదురుచూశాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ తనను తాను నిరూపించుకోవడానికి నిరంతరం శ్రమించాడు.

అరంగేట్ర మ్యాచ్‌లో అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెర్సీతో అర్జున్ టెండూల్కర్ బరిలోకి దిగాడు. కెప్టెన్ రిషభ్ పంత్ పవర్‌ప్లే ముగిసిన వెంటనే అర్జున్‌కు బౌలింగ్ బాధ్యతలు అప్పగించాడు. ఒక దశలో అర్జున్ వేసిన బంతికి పంత్ క్యాచ్ చేరవిడవడంతో వికెట్ దక్కే అవకాశం తృటిలో చేజారింది. అయినప్పటికీ పట్టుదలతో బౌలింగ్ చేసిన అర్జున్.. పంజాబ్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను ఔట్ చేసి తన ఐపీఎల్ కెరీర్‌లో లక్నో తరపున మొదటి వికెట్ సాధించాడు. మొత్తంగా 4 ఓవర్లలో 36 రన్స్ ఇచ్చి ఓ కీలక వికెట్ పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్‌లోనూ ఆఖరి ఓవర్లలో క్రీజులోకి వచ్చి 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Story first published: Sunday, May 24, 2026, 9:11 [IST]
Other articles published on May 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+