Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శుభ్‌మన్ గిల్‌, సారా టెండూల్కర్‌పై మరోసారి డేటింగ్‌ రూమర్లు?!!

Sara Tendulkar comment on Shubman Gill Editing Skills

ముంబై: కరోనా వైరస్ (కొవిడ్‌-19) వ్యాప్తి కార‌ణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడాలోకం స్తంభించిపోయింది. మరోవైపు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2020 నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ‌టంతో ఆట‌గాళ్లంతా ఇళ్లకే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మాత్రం టచ్‌లోనే ఉంటున్నారు. కొందరు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లలో తమ అనుభవాలను పంచుకుంటుంటుండగా.. మరికొందరు తమలో దాగి ఉన్న కొత్త కళలను బయటికి తీసుకువస్తున్నారు. తాజాగా యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌ కూడా తనలోని ఫొటో ఎడిటింగ్‌ స్కిల్స్‌ను చూపెట్టాడు.

శుభ్‌మన్‌ ఎడిటింగ్‌ స్కిల్స్:

శుభ్‌మన్‌ గిల్‌ తనలోని ఫొటో ఎడిటింగ్‌ స్కిల్స్‌ను అభిమానులకు పరిచయం చేసాడు. ఓ ఫొటోలో బ్యాగ్రౌండ్‌ ఒకే విధంగా కనబడేలా.. ఓవైపు వర్క్‌ అవుట్స్‌ చేస్తున్నట్టు, మరోవైపు కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతున్నట్టు ఎడిటింగ్‌ చేశాడు. ఈ ఫొటోను శుభ్‌మన్‌ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు. 'ఒకరు పనిపై శ్రద్ద చూపిస్తుంటే.. మరొకరు చిల్ అవుతున్నారు' అని కామెంట్ పెట్టాడు. ఆ ట్వీట్ కాస్త వైరల్ అయింది. దీంతో పలువురు నెటిజన్లు శుభ్‌మన్‌ ఎడిటింగ్‌ స్కిల్స్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.

 మరోసారి వార్తల్లో శుభ్‌మన్‌, సారా:

మరోసారి వార్తల్లో శుభ్‌మన్‌, సారా:

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ కూడా శుభ్‌మన్‌ గిల్‌ ఎడిటింగ్‌ స్కిల్స్‌పై కామెంట్ చేసారు. 'ఆ ఎడిటింగ్‌ అతనే చేశారని భావిస్తున్నారా?' అంటూ కామెంట్‌ చేశారు. ఏ ఒక్క కామెంట్ కారణంగా శుభ్‌మన్‌, సారా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సారానే ఈ ఎడిటింగ్‌ చేసి ఉంటారని కొందరు అంటుండగా.. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని మరికొందరు కామెంట్‌లు చేస్తున్నారు. ఇద్దరు మంచి స్నేహితులు అని ఇంకొందరు అన్నారు. డేటింగ్‌ నిజమో? అబద్దమో? తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం తమకు ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు.

కొత్త కారు కొన్న సందర్భంగా:

కొత్త కారు కొన్న సందర్భంగా:

గతేడాది శుభ్‌మన్‌ గిల్ కొత్త కారు కొన్న సందర్భంగా ఓ ఫొటో పోస్ట్‌ చేయగా.. సారా అతనికి కంగ్రాట్స్‌ చెప్పారు. దీనిపై స్పందించిన టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌‌ పాండ్యా.. శుభ్‌మన్‌ను ఆటపట్టించేలా ఓ ఫన్నీ కామెంట్‌ చేశారు. దీంతో అప్పట్లో కూడా సారా, శుభ్‌మన్‌ల మధ్య ఏదో ఉందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. సారా వయసు 22 కాగా.. శుభ్‌మన్‌ వయసు 20.

 కబాబ్స్ చేసిన సారా:

కబాబ్స్ చేసిన సారా:

కరోనా కారణంగా సారా ఇంట్లోని పనులు చకచకా చేస్తున్నారు. ఈ క్రమంలో బీట్‌రూట్ కబాబ్​లు చేశారట. ఈ కబాబ్​లను తిన్న సచిన్.. సారాపై ప్రశంసల వర్షం కురిపించాడు. బీట్‌రూట్ కబాబ్​లను సారా అద్భుతంగా చేసిందని చెప్పాడు. కబాబ్​లకు సంబందించిన పోటోలను సచిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 60 సెకన్లలోనే ప్లేట్​ను ఖాళీ చేశానంటూ.. తినక ముందు తిన్న తర్వాత ఫొటోలను పోస్ట్ చేశాడు. సారా సలాడ్ కూడా చేసినట్లు మాస్టర్ బ్లాస్టర్ వెల్లడించాడు.

Story first published: Thursday, May 14, 2020, 11:59 [IST]
Other articles published on May 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+