For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గోవాలో సారా టెండూల్క‌ర్, శుభ్‌మ‌న్ గిల్ షికార్లు.. ఆధారాలు ఇదిగో!

Sara Tendulkar And Shubman gill holiday trip in Goa

సారా టెండూల్క‌ర్. కుర్రాకారుకు ఈ పేరు గురించి ప‌రిచ‌యం అక్క‌ర‌లేదు. దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూతురిగా ప్ర‌పంచానికి ప‌రిచయ‌మైంది ఈ ముద్దు గుమ్మ‌. కానీ ఆ త‌ర్వాత త‌న అందంతో కుర్రాళ్ల మ‌న‌స్సును దోచేసింది. బాలీవుడ్ హీరోయిన్ల‌ను మించిన అందంతో త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా అభిమానుల‌ను సంపాదించుకుంది. సారా సోషల్ మీడియాలో త‌న ఫోటో పెట్టిందంటే చాలు అభిమానులు లైకులు, కామెంట్లు, షేర్స్‌తో రెచ్చిపోతారు. అంతేకాకుండా సారా గురించిన విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు క్షుణ్ణంగా అన్వేషిస్తుంటారు.

 గిల్‌తో సారా ప్రేమయాణం

గిల్‌తో సారా ప్రేమయాణం

దాదాపు రెండేళ్లుగా సారా టెండూల్క‌ర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఆమె టీమిండియా యువ క్రికెట‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌తో ప్రేమ‌లో ప‌డింద‌నేది ఆ వార్త సారాంశం. దానికి త‌గ్గ‌ట్టే వీరు కూడా ఆ వార్త‌ల‌ను ధృవీక‌రించ‌లేదు, అలాగ‌ని కొట్టి పారేయ‌లేదు. ఇంకేముందు నెటిజ‌న్స్ అంతా సారా, గిల్ ప్రేమయాణం నిజ‌మే అని న‌మ్మేశారు. అంతే కాదండోయ్ శుభ్‌మన్ గిల్‌ను స‌చిన్ టెండూల్క‌ర్ అల్లుడు అంటూ ఓ వ‌ర్గం మాట్లాడ‌డం కూడా మొద‌లు పెట్టింది.

స్టార్ సింగ‌ర్‌తో నైట్ డేట్‌

స్టార్ సింగ‌ర్‌తో నైట్ డేట్‌

సారా, గిల్ గురించి వార్తలు ఒక‌వైపు షికారు చేస్తుండ‌గానే గ‌త నెల‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో సారా పెట్టిన ఓ ఫోటో వైర‌ల్‌గా మారింది. ఓ వ్య‌క్తితో క‌లిసి నైట్ డేట్‌కు వెళ్లిన సారా అత‌ని చేయి ప‌ట్టుకుని న‌వ్వులు పూయిస్తున్న ఫోటోను షేర్ చేసింది. అందులో ఆ అజ్ఞాత వ్య‌క్తి మోహం క‌న‌ప‌డలేదు. ఆ స‌మ‌యంలో గిల్ ముంబై టెస్టు మ్యాచ్‌లో బిజీగా ఉన్నాడు.

దీంతో ఆ అజ్ఞాత వ్య‌క్తి ఎవ‌రంటూ నెటిజ‌న్స్ ఆరా తీశారు. తీరా చూస్తే అలాంటి ఫోటోనే బాలీవుడ్ స్టార్ సింగ‌ర్ కనికా కపూర్ కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజ‌న్స్ శుభ్‌మన్ గిల్‌కు సారా బ్రేక‌ప్ చెప్పేసి, క‌నికా క‌పూర్‌తో డేటింగ్‌లో ఉంద‌ని మాట్లాడుకోవ‌డం మొద‌లు పెట్టారు. దీనికి త‌గ్గ‌ట్టే శుభ్‌మ‌న్ గిల్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో ఏంజెల్స్‌తో ప్రేమ‌లో ప‌డ‌కూడ‌ద‌ని రాసి ఉన్న టీష‌ర్టును ధ‌రించి విచారంగా త‌ల ప‌ట్టుకున్న ఫోటోను షేర్ చేశాడు. దీంతో నెట్టిజ‌న్స్ వీరిద్ద‌రికి చెడింద‌ని మాట్లాడుకోవ‌డం మొద‌లుపెట్టారు.

గోవాలో సారా, గిల్‌

గాయం కార‌ణంగా సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు దూర‌మైన శుభ్‌మ‌న్ గిల్ ప్ర‌స్తుతం గోవాలో ఉన్న‌ట్లు అత‌ను షేర్ చేసిన ఫోటోల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది. అలాగే సారా టెండూల్క‌ర్ ఇటీవ‌ల ముగిసిన నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను గోవాలో జ‌ర‌పుకున్న‌ట్లు ఆమె పోస్టు చేసిన ఫోటోల‌ను బ‌ట్టి తెలుస్తోంది. దీంతో నెటిజ‌న్లు తాము సారా బాయ్ ఫ్రెండ్‌గా అనుమానిస్తున్న గిల్‌తో ఆమె గోవాలో షికార్లు చేస్తుంద‌ని వార్త‌ల‌ను వైర‌ల్ చేస్తున్నారు.

అంతేకాకుండా సారా గోవాలో ఓ కారులో ఫోటో దిగి షేర్ చేసింది. అయితే ఆ కారు గ‌తేడాది ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్టు సిరీస్ గెలిచిన సంద‌ర్భంగా గిల్‌కు ఆనంద్ మహీంద్రా బ‌హుమ‌తిగా ఇచ్చిన‌ది. కాగా సారా గోవా బీచ్ స‌మీపంలో ఆ కారులో కూర్చొని సూర్యాస్త‌మ‌యాన్ని ఆస్వాదించ‌డం గ‌మనించ‌వ‌చ్చు.

గిల్ కూడా ఆ ప్ర‌దేశంలోనే..

అయితే అచ్చం అలాంటి ప్ర‌దేశాల్లోనే గిల్ కూడా ఫోటోలు దిగి షేర్ చేశాడు. అంతేకాకుండా సారా మాల్దీవుల‌కు వెళ్తే, శుభ్‌మ‌న్ గిల్ కూడా మాల్దీవుల్లో ఓ హోట‌ల్‌లో చిల్ అవుతున్న ఫోటోల‌ను షేర్ చేశాడు. గిల్ కూడా నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను గోవాలోనే జ‌రుపుకున్నాడు. ఇంకేముంది సారా టెండూల్క‌ర్, శుభ్‌మ‌న్ గిల్ మ‌ళ్లీ క‌లిసి పోయార‌ని నెట్టిజ‌న్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఇద్ద‌రు ఒకే ద‌గ్గ‌ర ఉండి వేర్వేరుగా ఫోటోల‌ను షేర్ చేశార‌ని చెప్పుకుంటున్నారు. చూడాలి మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో, క‌నీసం ఈ సారైన సారా, గిల్ త‌మ ప్రేమాయ‌ణం గురించి నోరు విప్పుతారేమో.

సారా కెరీర్‌

సారా కెరీర్‌

క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ ముద్దుల కుమార్తె అయినా సారా టెండూల్క‌ర్ ఇంగ్లండ్‌లో మెడిసిన్ పూర్తి చేసింది. కొన్నాళ్ల క్రితం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి రాణిస్తోంది. అంతేకాకుండా సారా ఇటీవ‌ల బాలీవుడ్ మోడల్, నటులైన బనితా సంధు, తానియా ష్రాఫ్‌లతో కలిసి ఓ టీవీ ప్రకటనలో కూడా నటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియ‌న్ల ఫాలోవ‌ర్ల‌ను క‌లిగి ఉన్న సారాకు భారీ ఫాలోయింగే ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి పోస్టు పెట్టిన క్ష‌ణాల్లోనే వైర‌ల్ అవుతుంటుంది.

Story first published: Sunday, January 9, 2022, 11:09 [IST]
Other articles published on Jan 9, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+