Sara Tendulkar: చిన్నస్వామిలో వదిన-మరదళ్ల సందడి!
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌తో హోరెత్తిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఈ పోరును చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, గ్యాలరీలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్, కోడలు సానియా చందోక్. వీరిద్దరూ కలిసి మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించారు. ఇటీవల ఈ వదిన-మరదళ్లు ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. గుజరాత్, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను కూడా వీరు ఆస్వాదించారు.
వదిన-మరదళ్ల ఫోటోలు వైరల్
ప్రస్తుతం ఈ వదిన మరదళ్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గులాబీ రంగు డ్రెస్సులో చాలా సింపుల్‌గా, ఎంతో అందంగా కనిపిస్తున్న సారాను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు సారా, సానియా చందోక్ ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా జట్టును ఉత్సాహపరుస్తూ కనిపించారు. మధ్యమధ్యలో ఫోటోలకు పోజులిస్తూ, నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్న ఈ జంట ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

కెమెరా కళ్లన్నీ ఆమె వైపే!
సానియా చందోక్ ఇటీవల అర్జున్ టెండూల్కర్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే. సానియా సారా టెండూల్కర్ క్లోజ్ ఫ్రెండ్ కావడం విశేషం. సారా, సానియాలు తరచుగా విహారయాత్రలకు, పార్టీలకు కలిసి వెళ్తుంటారు. ఈ మ్యాచ్ సందర్భంగా కూడా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం స్పష్టంగా కనిపించింది. గ్యాలరీలో కూర్చుని ఆటను ఆస్వాదిస్తూనే, మైదానంలో జరుగుతున్న ప్రతి మూమెంట్‌ను ఎంతో ఆసక్తిగా గమనించారు. సారా స్టేడియంకు వచ్చిందంటే చాలు, అక్కడ కెమెరా కళ్లన్నీ ఆమె వైపే తిరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
క్రికెట్ అంటే అమితమైన ఇష్టం ఉన్న సారా, తరచుగా ఐపీఎల్ మ్యాచ్‌లకు హాజరవుతుంటుంది. ముఖ్యంగా తన తండ్రి సచిన్ టెండూల్కర్ మెంటార్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లలో ఆమె క్రమం తప్పకుండా కనిపిస్తుంది. అయితే, ఈసారి చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ మ్యాచ్‌కు హాజరుకావడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను అప్‌డేట్ చేస్తూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications