
కంటి సమస్యను దూరం చేసారు:
ఆదివారం స్పోర్ట్‌స్టార్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో మాట్లాడిన సక్లయిన్ ముస్తాక్ అప్పటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నాడు. 'అప్పుడు ఇంగ్లండ్‌లో ఉన్నాం. ఆ సమయంలో కంటి సమస్యను అనిల్ భాయ్ దృష్టికి తీసుకువెళ్లాను. వెంటనే స్పందించిన కుంబ్లే.. డాక్టర్ భరత్ రుగానీ గురించి చెప్పాడు. కుంబ్లేతో పాటు సౌరవ్ గంగూలీ కూడా ఆయన దగ్గర కంటికి సంబంధించి ట్రీట్‌మెంట్‌మెంట్ తీసుకుంటామని తెలిపాడు. హార్లే స్ట్రీట్ (లండన్)లో ఉండే డాక్టర్ భరత్ దగ్గరికి వెళ్లమని చెప్పి.. కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు. ఆ తర్వాత వెళ్లి కలిశాను. నా కళ్లను పరీక్షించిన ఆయన లెన్స్ ఇచ్చారు. నాకున్న సమస్య అప్పటి నుంచి తీరింది' అని సక్లయిన్ తెలిపాడు.

పెద్దన్న లానే చూస్తా:
'నా తీవ్రమైన కంటి సమస్యకు పాకిస్తాన్‌లో చాలామంది కంటి డాక్టర్ల వద్దకు వెళ్లాను. కానీ.. ఎవరూ నా సమస్యను తీర్చలేకపోయారు. కుంబ్లే సాయంతో భరత్ రుగానీ చేసిన ట్రీట్‌మెంట్ ఫలించింది. నా కంటి సమస్యకు కుంబ్లేనే శాశ్వత పరిష్కారాన్ని చూపించాడు. నేను ఎప్పుడూ కుంబ్లేను పెద్దన్న లానే చూస్తా. మేం ఎప్పుడూ కలిసినా ఒకరి సంస్కృతిని గౌరవించుకుంటూ ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటాం. మైదానంలో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఇద్దరం ఎప్పుడూ కూడా క్రికెట్‌లో ప్రత్యర్థులుగానే తలపడ్డాం, ఒకే జట్టులో ఎప్పుడూ లేము. అవకాశం వస్తే ఇద్దరం కలిసి ఒకే జట్టులో ఆడాలని కోరుకుంటున్నా' సక్లయిన్ చెప్పుకొచ్చాడు.

కెప్టెన్, కోచ్‌గా కూడా తనదైన ముద్ర:
భారత క్రికెట్‌లో మంచి సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్న క్రికెటర్లలో అనిల్ కుంబ్లే ఒకడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గానే కాకుండా కోచ్‌గా కూడా తనదైన ముద్ర వేశాడు. కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో కొన్ని కఠిన నిర్ణయాలను అమలు చేయడంతో.. అది నచ్చని మన క్రికెటర్లు అతనికి ముగింపు పలికారు. తన కోచింగ్ ముగింపును కూడా ఏమాత్రం వివాదం చేయకుండా గౌరవంగా తప్పుకున్నాడు కుంబ్లే. ఇప‍్పటివరకూ కుంబ్లే ఒకరిచేత విమర్శించబడటం కానీ, వేరే వాళ్లను విమర్శించడం కానీ చాలా అరుదు. ఒకవేళ ఏమైనా ఎవరిపైనా అయిన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చినా సుతిమెత్తగానే వారిస్తాడు.


Click it and Unblock the Notifications












