For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సక్లయిన్ ముస్తాక్.. ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు! యూవీకి కంగ్రాట్స్! షారుఖ్‌లా ఉన్నాడంటోన్న నెటిజన్లు

Saqlain Mushtaq posts congratulatory tweet for Yuvraj Singh. Twitterati cant stop talking about his look

క‌రాచీ: పాకిస్తాన్ లెజెండ‌రీ స్పిన్న‌ర్ స‌క్ల‌యిన్ ముస్తాక్ చాలాకాలం త‌రువాత మీడియా కంట్లో ప‌డ్డారు. ఇటీవ‌లే అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్ర‌కటించిన పంజాబ్ డైన‌మేట్ యువ‌రాజ్ సింగ్‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ ట్వీట్ చేశారు. యువ‌రాజ్ సింగ్‌, అశీష్ నెహ్రాల‌తో క‌లిసి దిగిన ఓ పిక్‌ను దీనికి జ‌త చేశారు. అద్భుత‌మైన త‌న కేరీర్‌కు ముగింపు ప‌లికిన త‌న స్నేహితుడు యువ‌రాజ్ సింగ్‌కు శుభాకాంక్ష‌లు. రాబోయే త‌రానికి నువ్వు స్ఫూర్తి ప్ర‌దాత‌వు. ఓ గొప్ప ఛాంపియ‌న్‌వి.. అంటూ ట్వీటారు స‌క్లాయిన్ ముస్తాక్‌.

రాక్‌స్టార్‌లా ఉన్నారంటూ..
ఈ ట్వీట్‌కు ఆయ‌న జ‌త చేసిన ఓ ఫొటో నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. దీనిపై జోరుగా కామెంట్లు అందుకున్నారు ట్విట్ట‌రెట్టీలు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన త‌రువాత ముస్తాక్ త‌న శ‌రీరాకృతిపై దృష్టి పెట్టిన‌ట్టున్నార‌ని, షారుఖ్ ఖాన్‌, ఉద‌య్ చోప్రాల‌ను త‌ల‌పించేలా హ్యాండ్‌స‌మ్‌గా త‌యార‌య్యార‌ని కితాబిస్తున్నారు. రాక్‌స్టార్‌లా ఉన్నాడంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ప్ర‌పంచ‌క‌ప్‌లో హ్యాట్రిక్ తీసుకున్న రెండో బౌల‌ర్‌గా..
స‌క్ల‌యిన్ ముస్తాక్ కేరీర్‌లో అనేక మైలురాళ్లున్నాయి. ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్‌లో హ్యాట్రిక్ తీసుకున్న బౌల‌ర్‌గా త‌న పేరు లిఖించుకున్నారు. 1999 జూన్ 11వ తేదీన ప‌సికూన జింబాబ్వేపై ఆయ‌న ఈ ఫీట్‌ను సాధించారు. ప్ర‌పంచ‌క‌ప్‌లో హ్యాట్రిక్ తీసుకున్న రెండో బౌల‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. పాకిస్తాన్‌కే చెందిన ఏస్ బౌల‌ర్ వ‌సీమ్ అక్ర‌మ్ ప్ర‌పంచ‌క‌ప్‌లో హ్య‌ట్రిక్ వికెట్లు సాధించిన మొద‌టి బౌల‌ర్‌. జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచ్‌లో ముస్తాక్ హెన్రీ ఒలాంగో, ఆడ‌మ్ హ‌కిల్‌, ఎంబంగ్వాల‌ను వ‌రుస బంతుల్లో పెవిలియ‌న్ చేర్చారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

Story first published: Friday, June 14, 2019, 13:50 [IST]
Other articles published on Jun 14, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+