‘నా ప్రైవేట్ భాగాలు తాకారు’.. పృథ్వీ షాపై సంచలన ఆరోపణలు!

టీమిండియా యువ ప్లేయర్ పృథ్వీ షాపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ షాకింగ్ ఆరోపణలు చేసింది. కొన్ని రోజుల క్రితం ముంబైలోని ప్రముఖ స్టార్ హోటల్ వద్ద పృథ్వీ షా స్నేహితుడి కారుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. షాతో సెల్ఫీలు తీసుకున్న సప్న, ఆమె స్నేహితులు మరోసారి సెల్ఫీలు కోరడంతో షా నిరాకరించాడు.

తప్పుడు ఆరోపణలన్న సప్న..
దీంతో హోటల్ బయట కాపుకాసిన సప్నా, శోభిత్ ఠాకూర్ సహా ఎనిమిది మంది.. షా స్నేహితుడి కారుపై దాడి చేశారు. ఈ ఘటనపై షా వర్గం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అరెస్టయిన సప్నా గిల్.. షాపై సంచలన ఆరోపణలు చేసింది. పృథ్వీ షాను తాము ఎలాంటి సెల్ఫీలు అడగలేదని, తాము కూడా ఆ హోటల్‌లో ఎంజాయ్ చేస్తున్నామని చెప్పింది. తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. తాము ఎవరిపైనా దాడులు చేయలేదని, డబ్బులు అడగలేదని చెప్పింది.

షా వర్గమే గొడవ చేసింది..
హోటల్‌లో తాము ఎంజాయ్ చేస్తుండగా షా, అతని స్నేహితులు సప్నాతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ను తడిమారని ఆమె తరఫు లాయర్ ఫిర్యాదు చేశారు. దీంతో సప్నా స్నేహితులు షా బృందంతో గొడవకు దిగారని ఆమె ఈ ఫిర్యాదులో పాల్గొంది. 'మేం ఎవర్నీ కొట్టలేదు. డబ్బులు, సెల్పీలు ఏం అడగలేదు. మా గ్రూప్ అంతా ఎంజాయ్ చేస్తున్నాం అంతే' అని ఆమె చెప్పింది. ఈ గొడవను వీడియో తీసేందుకు ప్రయత్నించిన తన స్నేహితుడిపై కూడా షా వర్గం దాడి చేసిందని తెలిపింది.

ప్రైవేట్ భాగాలు తాకారు..
తన క్లయింటుతో అసభ్యంగా ప్రవర్తించి, ఆమె గౌరవం తగ్గేలా ప్రవర్తించినట్లు పృథ్వీ షా, అతని స్నేహితులపై సప్న తరఫు లాయర్ కేసు వేశారు. దానికితోడు సప్నపై బేస్‌బాల్ బ్యాటుతో దాడి చేసినట్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. స్నేహితుడిని రక్షించుకోవడానికి ప్రయత్నించిన సమయంలో సప్నను కొందరు బేస్ బాల్ బ్యాటుతో కొట్టారని ఆరోపించారు. 'నేను వెళ్లి వాళ్లను ఆపాను. నా ఫ్రెండ్ ఈ గొడవకు సాక్ష్యం కోసం వీడియో తీయబోయాడు. వాళ్లు నన్ను బేస్ బాల్ బ్యాటుతో కొట్టారు. కొంతమంది నన్ను కొట్టడంతో ఆగకుండా నా ప్రైవేట్ భాగాలను తడిమారు. నా మొఖంపై కూడా కొట్టారు' అని సప్న ఆరోపించింది.

పృథ్వీ షాపై కేసు..
ఈ కేసు కూడా నమోదు చేసుకున్న పోలీసులు.. సప్న ఆరోపణల ఆధారంగా పృథ్వీ షా, అతని స్నేహితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సప్న చేతిలో బేస్ బాల్ బ్యాటుతో ఉండగా పృథ్వీ షా ఆమె చేతిలో నుంచి దాన్ని బలవంతంగా లాక్కోవడం కనిపించింది. ఆ వెంటనే ఈ గొడవను వీడియో తీస్తున్న వ్యక్తి చేతిలోని మొబైల్ లాక్కున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ ఘటనలో ఉపయోగించిన కారు, బేస్ బాల్ బ్యాటును పోలీసులు ఇంకా రికవర్ చేయలేదని సమాచారం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications