
రిజర్వ్ ఆటగాళ్లకు చోటు:
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీకి కివీస్ స్వరీస్ కోసం భారత సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. టెస్టు ఫార్మాట్‌లో రాణిస్తున్న హైదరాబాదీ గల్లీ భాయ్ మహమ్మద్ సిరాజ్‌ను పరిమిత ఓవర్ల కోసం బీసీసీఐ ఎంపిక చేసింది. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో ఐపీఎల్ 2021లో కోల్‌కతా తరఫున రాణించిన వెంకటేశ్ అయ్యర్‌కు అవకాశం దక్కింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని పక్కనపెట్టిన బీసీసీఐ సెలెక్టర్లు.. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌కు అవకాశం ఇచ్చారు. ఇక ప్రపంచకప్ 2021లో రిజర్వ్ ఆటగాళ్లుగా కొనసాగిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్‌కు భారత జట్టులో చోటు దక్కింది.

కీపర్ మాత్రమే కాదని, మంచి ఫీల్డర్ కూడా:
అయితే న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు భారత జట్టులో చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్ 2021కు వికెట్ కీపర్లుగా ఎంచుకున్న రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌కు మరోసారి భారత సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. దీంతో శాంసన్‌కు చోటు దక్కకుండా పోయింది. ఐపీఎల్ 2021లో రాణించిన శాంసన్‌కు చోటు ఇవ్వకపోవడంతో భారత అభిమానులు బీసీసీఐ సెలక్టర్లపై మండిపడుతున్నారు. మరోవైపు శాంసన్ కూడా పరోక్షంగా బీసీసీఐపై సెటైర్ వేశాడు. చాలా సందర్భాల్లో బౌండరీ దగ్గర అద్భుతమైన ఫీల్డింగ్‌తో జట్టును ఆదుకున్న ఫొటోలను ట్వీట్ చేసి.. తాను కీపర్ మాత్రమే కాదని, మంచి ఫీల్డర్ కూడా అంటూ సెలెక్టర్ల నిర్ణయంపై నిరాశ వ్యక్తం చేశాడు. శాంసన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.

10 టీ20లు.. 117 పరుగులు:
2015లో జింబాబ్వేతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ ద్వారా భారత జట్టు తరఫున సంజూ శాంసన్ అరంగేట్రం చేశాడు. మొత్తంగా 10 టీ20లు ఆడిన శాంసన్ 110.37 సగటుతో 117 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 27. ఇక ఈ ఏడాది శ్రీలంక పర్యటనలో ఒక వన్డే ఆడి 46 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు శాంసన్ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. శాంసన్ ఒక వన్డే ఆడి 46 పరుగులు చేయగా.. టెస్టులో ఇంకా ఆరంగేట్రం చేయలేదు.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చహల్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్.


Click it and Unblock the Notifications












