కెప్టెన్‌గా సంజూ శాంసన్?
టీమిండియా టీ20 కెప్టెన్సీలో ఊహించని మలుపు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత టీ20 క్రికెట్లో ఓ నవశకం ఆరంభం కాబోతుందా అంటే ఔననే క్రీడా వర్గాలు అంటున్నాయి. టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ త్వరలోనే భారత టీ20 పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో సంజూ శాంసన్ కనబరుస్తున్న నిలకడైన ప్రదర్శన చూసి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ అండ్ టీమ్ ముగ్ధులయ్యారు. ఈ మేరకు సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా ప్రమోట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
వరల్డ్ కప్ హీరోగా ఎదిగిన సంజూ
టీ20 వరల్డ్ కప్ 2026 విజయంలో సంజూ శాంసన్ పోషించిన పాత్ర అద్భుతం. నిజానికి టోర్నీ ప్రారంభంలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లకు ప్రాధాన్యతనివ్వడంతో సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో తుది జట్టులోకి వచ్చాడు. వెస్టిండీస్‌తో జరిగిన కీలక పోరులో 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును ఆదుకోవడమే కాకుండా సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌లోనూ వరుసగా 89 పరుగుల చొప్పున సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు.

సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తు ఏమిటి?
ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఇప్పుడు సందిగ్ధంలో పడింది. నివేదికల ప్రకారం.. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా నియమించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఒకవేళ సంజూ శాంసన్‌కు నేరుగా కెప్టెన్సీ ఇవ్వని పక్షంలో సూర్యకుమార్‌కు మరో అవకాశం ఇచ్చి, సంజూను వైస్ కెప్టెన్‌గా నియమిస్తారు. అయితే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోతే వెంటనే సంజూకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
శ్రేయస్ అయ్యర్‌కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు?
కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్ పేరు బలంగా వినిపించినప్పటికీ.. సెలెక్టర్లు అయ్యర్ పట్ల విముఖత చూపడానికి ఓ బలమైన కారణం ఉంది. శ్రేయస్ అయ్యర్ చాలా కాలంగా టీ20 ఫార్మాట్ అంతర్జాతీయ సర్క్యూట్‌లో లేకపోవడం అతనికి మైనస్‌గా మారింది. కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే కెప్టెన్సీ ఇవ్వలేమని.. ముందుగా అతను జట్టులో తన స్థానాన్ని నిరూపించుకోవాలని అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. మరోవైపు సంజూ వికెట్ కీపర్‌గా కూడా జట్టుకు అదనపు బలాన్ని ఇస్తుండటంతో సెలెక్టర్ల మొగ్గు అతని వైపే ఉంది.
మలయాళీ క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు
కేరళ నుంచి వచ్చి ఎన్నో ఏళ్లపాటు ప్రతిభ ఉండి కూడా సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడిన సంజూ శాంసన్‌కు ఇది నిజంగా ఓ గొప్ప విజయం. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూ భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సంజూ శాంసన్.. ఇప్పుడు టీమిండియాను నడిపించే స్థాయికి చేరడం పట్ల సోషల్ మీడియాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సంజూ కెప్టెన్సీలో టీమిండియా మరిన్ని విజయాలు సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications