Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా కప్ టోర్నీకి కేఎల్ రాహుల్‌ను కాకుండా అతన్ని ఎంపిక చేయాల్సింది : డానిష్ కనేరియా

Sanju Samson Should Select Instead Of KL Rahul Says Danish Kaneria

కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే జట్టులోకి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. ఇక అతను ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉన్నందున.. అతని స్థానంలో సంజూ శాంసన్ ఆసియా కప్ టోర్నీకి ఎంపికై ఉండాల్సిందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇకపోతే ఐపీఎల్ అనంతరం కేఎల్ రాహుల్ గాయంతో వరుసగా సిరీస్లకు దూరమైన సంగతి తెలిసిందే. ఇటీవల అతను ఫిట్ నెస్ పరీక్షలు విజయవంతంగా పాసవ్వడంతో జింబాబ్వే పర్యటనకు కెప్టెన్‌గా ఎంపికైయ్యాడు. ఓ ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్‌‌తో కనేరియా మాట్లాడుతూ.. రాహుల్ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్నాడని.. తగినంత ప్రిపరేషన్ లేకుండానే ఆసియా కప్‌కు వెళ్తున్నాడని చెప్పాడు.

'కేఎల్ రాహుల్ పెద్ద గాయం నుంచి కోలుకున్నాడు. ఆ తర్వాత అతను జింబాబ్వే పర్యటనకు వెళ్ళాడు. ఇప్పుడు అతను ఆసియా కప్ జట్టులోకి చాలా ముందస్తుగా వెళ్లినట్లు అనిపిస్తోంది. భారత్‌లో సంజూ శాంసన్‌ లాంటి ప్లేయర్ ఉండగా.. తగినంత ప్రిపరేషన్ లేని రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేశారో. సంజూ అద్భుతమైన క్రికెటర్. అతని సొగసైన బ్యాటింగ్‌కు నేను మంత్రముగ్ధుడునవుతాను. శాంసన్‌కు టీమిండియా తరఫున ఆడే అవకాశాలు సరిగ్గా రాలేదు. అతను జట్టులో ఉన్నట్టే ఉంటాడు కానీ ఎప్పుడూ జట్టుకు అవతలే ఉంటాడు. ఇప్పుడిప్పుడే కాస్త అవకాశాలొస్తున్నాయి. ఎందుకంటే ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు అతనేంటో బాగా తెలుసు. అతను ఎంతటి ట్యాలెంటెడో కూడా తెలుసు.' అని కనేరియా చెప్పాడు.

'రాహుల్ పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ అయ్యాకే అతన్ని సెలెక్ట్ చేయాల్సింది. సంజూ శాంసన్‌కు అతని స్థానంలో ఆసియా కప్‌లో ఆడే అవకాశం లభించి ఉండాలి. రాహుల్‌ను ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 కప్ మీద దృష్టి పెట్టేలా చేయాల్సింది. ఆస్ట్రేలియా ట్రాక్‌లు కేఎల్ రాహుల్‌కు సెట్ అవుతాయి' అని కనేరియా తెలిపాడు.

Story first published: Friday, August 26, 2022, 20:01 [IST]
Other articles published on Aug 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+