Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL: టీ20 సిరీస్ నుంచి సంజూ అవుట్.. తొలి మ్యాచ్‌లో ఆడలేదనేనా?

Sanju Samson ruled out of INDvsSL T20I series

టీమిండియా అభిమానులకు బీసీసీఐ షాకింగ్ వార్త చెప్పింది. శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌కు కేరళ డ్యాషింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ దూరమైనట్లు వెల్లడించింది. వాంఖడే వేదికగా జరిగిన తొలి టీ20లో సంజూ శాంసన్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లో వెంట వెంటనే రెండు వికెట్లు పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. ఇన్నింగ్స్ నిర్మించలేకపోయాడు. ధనంజయ డిసిల్వ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి కేవలం 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దనే పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత ఫీల్డింగ్‌లో కూడా లంక ఓపెనర్ పాథుమ్ నిస్సంక ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు. ఇది చూసిన చాలా మంది సంజూకు అవకాశాలు రావడమే గగనం. అలా వచ్చిన అవకాశాలను ఇలా చేజేతులారా నాశనం చేసుకోవడం ఏంటి? అని అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఈ మ్యాచ్‌లో సరిగా ఆడకపోవడంతో రెండో టీ20లో అతన్ని పక్కన పెడతారేమో అని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. అలాంటి సమయంలో అతను అసలు మొత్తం టీ20 సిరీస్‌కే దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. తొలి టీ20లో సంజూ గాయపడ్డాడని చెప్పిన బీసీసీఐ ఈ షాకింగ్ విషయం తెలియజేసింది.

ఈ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సంజూ మోకాలికి గాయమైనట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో అతనికి వెంటనే స్కాన్స్ తీయించామని, నిపుణులు అతనికి విశ్రాంతి అవసరం అని చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వార్త విన్న అభిమానులు షాకైపోయారు. ఇంత పక్షపాతం చూపించడం కరెక్ట్ కాదంటూ బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సంజూ స్థానంలో విదర్భ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. అతను ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున రాణించిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, January 5, 2023, 7:40 [IST]
Other articles published on Jan 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+