ధోనీ ఓ దిగ్గజం.. అతనిలా ఎవరూ ఆడలేరు.. పోలిక వద్దు: సంజూ శాంసన్

దుబాయ్‌: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ దిగ్గజమని, అతనితో తనను పోల్చవద్దని రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శాంసన్ విజ్ఞప్తి చేశాడు. ధోనీలా మరెవరూ ఆడలేరని, అతడిని అనుకరించే ప్రయత్నమూ చేయకూడదని ఈ కేరళ ఆటగాడు చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌లో అలరిస్తున్న శాంసన్.. ధాటైన ఇన్నింగ్స్‌లతో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించాడు.

కింగ్స్ పంజాబ్‌ జట్టుపై అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి రికార్డు చేజింగ్‌లో కీలక పాత్ర పోషించిన సంజూను కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ప్రశంసించారు. భవిష్యత్తు మహీ అవుతాడని కొన్నేళ్ల క్రితమే చెప్పానని గుర్తుచేశారు. కాగా ఆయన అభిప్రాయంతో మాజీ క్రికెటర్‌ గంభీర్‌ విభేదించిన విషయం తెలిసిందే. శాంసన్‌ను శాంసన్‌లాగే ఉండనివ్వండని సూచించారు. ఈ నేపథ్యంలో మహీతో తనను పోల్చడంపై శాంసన్ స్పందించాడు.

ప్లీజ్.. ఈ చర్చను పక్కన పెట్టండి..

ప్లీజ్.. ఈ చర్చను పక్కన పెట్టండి..

‘ధోనీలా ఎవ్వరూ ఆడలేరు. అతడిని అనుకరించవద్దు. మహీ భాయ్‌లా ఆడటం అంత సులభమేమీ కాదు. అందుకే ఆ చర్చను పక్కన పెట్టేయండి. నేనెప్పుడూ ఆయనలా ఆడలేదు. భారత క్రికెట్లో ఆయనో దిగ్గజం. నేను నా ఆటపై మాత్రమే దృష్టి పెడతాను. నేనేం చేయగలను? ఎలా మెరుగ్గా ఆడగలను? ఎలా మ్యాచులు గెలిపించగలను? వంటి విషయాలపైనే దృష్టిసారిస్తాను' అని సంజూ పేర్కొన్నాడు.

గెలిపించడమే నా టార్గెట్..

గెలిపించడమే నా టార్గెట్..

ఇక తన ఆటతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించరా? అని ప్రశ్నించగా.. ‘బహుశా వారు దృష్టిలోపడొచ్చు. పడకపోవచ్చు. కానీ నేను ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాను. నా జట్టును గెలిపించడమే నా ముందున్న లక్ష్యం. నేను ఏ జట్టుకు ఆడినా అదే చేస్తా. ప్రస్తుతం నా దృష్టి ఐపీఎల్‌పై మాత్రమే ఉంది. నా ఆటను నేను అర్థం చేసుకున్నాను. నా బలమంతా పవర్ హిట్టింగ్‌లోనే ఉందని అర్థమైంది. కొన్నేళ్లు పవర్‌ హిట్టింగ్‌పై శ్రమిస్తున్నాను. వీడియో విశ్లేషకుడితో పనిచేస్తూ నా ఆటను మెరుగుపరుచుకున్నాను. ప్రస్తుతం మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. అందుకే బాగా ఆడగలుగుతున్నాను. డొమెస్టిక్‌ క్రికెట్‌లో కేరళ, జైపూర్‌లో ఆడిన అనుభవం ఉన్నందున్న యూఏఈ వేడిని తట్టుకుంటున్నాను'అని శాంసన్ తెలిపాడు.

విరాట్ ఆ మాట అనగానే..

విరాట్ ఆ మాట అనగానే..

ఒకానొక సందర్భంలో విరాట్‌ కోహ్లీతో జరిగిన సంభాషణను శాంసన్ గుర్తు చేసుకున్నాడు.‘టీమిండియాకు ఆడుతున్నప్పుడు ఒకరోజు జిమ్‌లో విరాట్‌ బ్రోను కలిశాను. భిన్నమైన అంశాల గురించి ప్రశ్నించాను. ఇంకెన్నాళ్లు ఆడతావని విరాట్ నన్నడిగినప్పుడు 10 ఏళ్లని సమాధానమిచ్చాను. అయితే ఈ పదేళ్లు క్రికెట్‌ కోసం జీవితం ధారపోయి. ఆ తర్వాత నీకిష్టమైన కేరళ ఆహారం తీసుకోవచ్చని సూచించాడు. అందుకే ఈ 10-12 ఏళ్లు అత్యుత్తమంగా ఆడేందుకు ఆటకు మాత్రమే అంకితమవుతాను. ' అని సంజు చెప్పాడు.

ఇప్పటికే 16 సిక్స్‌లు..

ఇప్పటికే 16 సిక్స్‌లు..

ఈ 25 ఏళ్ల కేరళ బ్యాట్స్‌మన్ రెండు మ్యాచ్‌ల్లోనే 16 సిక్స్‌లు కొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తన ఫస్ట్ మ్యాచ్‌లో 32 బంతుల్లో 74 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కింగ్స్ పంజాబ్‌తో జరిగిన తదుపరి మ్యాచ్‌లో 223 పరుగుల భారీ లక్ష్యచేధనలో 42 బంతుల్లో 85 పరుగులు చేసిన శాంసన్.. టీమ్‌కు అద్భుత విజయాన్నందించాడు.

రాయుడు, బ్రావో ఫిట్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌తో తదుపరి మ్యాచ్‌కు రెడీ: సీఎస్‌కే సీఈవో

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, September 30, 2020, 12:18 [IST]
Other articles published on Sep 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X