Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎంపీ చేతుల మీదగా 23 ఏళ్లకే స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన క్రికెటర్

Sanju Samson opens sports academy

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంజు శాంసన్ 23 ఏళ్లకే క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే అకాడమీని ప్రారంభించాడు. క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ ఆటగాళ్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన సిక్స్ గన్స్ స్పోర్ట్స్ అకాడమీని ఎంపీ శశి థరూర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సంజు శాంసన్ మాట్లాడుతూ ఈ అకాడమీని కేవలం క్రికెట్‌కు మాత్రమే పరిమితం చేయలేదని, ప్రతిభ కలిగిన ఫుట్‌బాల్ క్రీడాకారులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా శిక్షణ ఇస్తామని తెలిపాడు. అంతేకాదు ఈ అకాడమీ తిరువనంతపురంలో ఉన్నప్పటికీ సెలక్షన్ క్యాంపులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని పేర్కొన్నాడు.

సంజూ శాంసన్ తండ్రి ఢిల్లీ పోలీసు డిపార్ట్‌మెంట్ తరఫున ఫుట్‌బాల్ క్రీడకు ప్రాతినిధ్యం వహించడంతో ఈ అకాడమీకి అతని తండ్రి సహకారం అందించనున్నాడు. క్రికెట్‌తో పాటు పుట్‌బాల్‌ ఆటగాళ్లకు ట్రైనింగ్ ఇవ్వాలనేది తన తండ్రి ఐడియా అని తెలిపాడు.

అనుభవం కలిగిన కోచ్‌లు తమ అకాడమీలో ఉన్నారని, అవసరమైతే బయటి నుంచి కూడా కోచ్‌లను రప్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. దేశవాళీ టోర్నీల్లో సంజు శాంసన్ అద్భుత ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే.

Story first published: Friday, March 2, 2018, 18:23 [IST]
Other articles published on Mar 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+