For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అవకాశాలను ఎందుకు వృధా చేస్తున్నావ్ సంజూ.. ఇలా అయితే కష్టం

Sanju Samson Not Utilising To Get Into Indian Squad For T20 World Cup Says Ian Bishop

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022ను హాఫ్ సెంచరీతో ప్రారంభించి మంచి ఉత్సాహంతో కన్పించాడు. కానీ తన ఫామ్‌ను మాత్రం అనుకున్నంత రేంజులో కొనసాగించలేకపోతున్నాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అతను 27బంతుల్లో 55పరుగులు చేయడమే అత్యధిక స్కోరుగా ఉంది. ఎనిమిది మ్యాచ్‌లలో అతను ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. గత ఆరు మ్యాచ్‌లలో 4సార్లు 30కంటే తక్కువ పరుగులకే ఔటయ్యాడు. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్‌ జట్టులో చోటు దక్కించుకోవడానికి, బీసీసీఐ సెలెక్టర్లను ఆకట్టుకోవడానికి ఈ ఐపీఎల్లో సంజూ శాంసన్ రాణించడం కీలకమైన చివరి అవకాశం. శాంసన్ ఇప్పటివరకు తన రేంజుకు తగ్గ స్కోరు చేయలేకపోవడం అతన్ని సెలక్షన్ లిస్టులో వెనక్కు నెట్టేస్తుంది.

ఐపీఎల్ - 2022లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌ల్లో శాంసన్ 32.57సగటుతో, 165.22 స్ట్రైక్-రేట్‌తో 228పరుగులు చేశాడు. అయితే శాంసన్ ప్రదర్శన పర్వాలేదనిపించినా.. అతను ఇంకా మెరుగ్గా రాణించగలడని వెస్టిండీస్ పేస్ దిగ్గజం ఇయాన్ బిషప్ అభిప్రాయపడ్డాడు. 'రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ తక్కువ స్కోరుకే ఔటవుతున్న టైంలో తన జట్టును నడిపించే అవకాశాన్ని, సెలెక్టర్లను ఆకట్టుకునే ప్రదర్శన చేసే అవకాశాన్ని సంజూ వృథా చేస్తున్నాడు. తన మంచి ఫామ్‌ను ఉపయోగించుకోలేకపోతున్నాడు' అని బిషప్ ESPNCricinfoకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఫిబ్రవరిలో శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టీ20సిరీస్‌లో చివరిసారిగా టీమిండియా తరఫున సంజూ శాంసన్ ఆడాడు.

కాగా నిన్న ఆర్సీబీపై రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ తొందరగా ఔటవ్వగా.. సంజూ శాంసన్‌కు పెద్ద ఇన్నింగ్స్ ఆడే అవకాశం వచ్చింది. ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ ఆడిన మ్యాచ్‌ల్లో జోస్ బట్లర్ ఒక్కడే భారీ స్కోరు చేస్తుండడంతో మిగిలిన ప్లేయర్లకు తగినంత ఇన్నింగ్స్ ఆడే వీలు చిక్కడం లేదు. నిన్నటి మ్యాచ్‌లో బట్లర్ త్వరగా ఔటయినప్పుడు.. శాంసన్ నిలకడతో పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సింది. శాంసన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మంచి టచ్‌లో కనిపించాడు. 3 సిక్సర్లు, ఒక ఫోర్ కూడా బాదాడు. 21బంతుల్లో 27పరుగులు చేసిన శాంసన్ ఇక చెలరేగుతాడు అనుకున్న సమయంలో అనవసర షాట్లకు ప్రయత్నించడం కొంపముంచింది. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా వేసిన బౌలింగ్లో.. రివర్స్ స్వీప్ చేయడానికి ప్రయత్నించాడు. మొదట రివర్స్ స్వీప్ విషయంలో విఫలమయ్యాక.. ఆ ప్రయత్నాన్ని విరమించాల్సింది. కానీ శాంసన్ తర్వాత బంతికి కూడా అదే తరహా స్వీప్ ప్రయత్నించగా.. బంతి మిస్సయి వికెట్లను తాకింది. దీంతో ఒక మంచి అవకాశాన్ని అనవసరంగా శాంసన్ చేజార్చుకున్నాడు.

Story first published: Wednesday, April 27, 2022, 18:38 [IST]
Other articles published on Apr 27, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+