Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంజు శాంసన్ - హెన్రిచ్ క్లాసెన్ గొడవ: ఒక్క పోస్ట్‌తో తేల్చేసాడు..!

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మే 18న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ ఉత్కంఠభరిత పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.అయితే ఈ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్, చెన్నై సూపర్ కింగ్స్ వికెట్‌కీపర్ సంజు శాంసన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. తాజాగా ఈ వివాదంపై సంజు శాంసన్ అధికారికంగా స్పందిస్తూ పూర్తి స్పష్టతనిచ్చాడు.

తిలక్ వర్మ - హీరోయిన్ శ్రీలీల డేటింగ్: తేల్చేసిన తల్లి..!

తిలక్ వర్మ - హీరోయిన్ శ్రీలీల డేటింగ్: తేల్చేసిన తల్లి..!

సన్‌రైజర్స్ జట్టు 181 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 15వ ఓవర్‌లో ఈ గొడవ మొదలైంది.నూర్ అహ్మద్ వేసిన బాల్‌ను వికెట్‌కీపర్ సంజు శాంసన్ మెరుపు వేగంతో అందుకుని హెన్రిచ్ క్లాసెన్‌ను స్టంప్ అవుట్ చేశాడు. సంజు తన జట్టు ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకుంటున్న సమయంలో క్లాసెన్‌తో చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది.

అదే నిజమైతే హార్దిక్ పాండ్యాను తప్పించేయండి

అదే నిజమైతే హార్దిక్ పాండ్యాను తప్పించేయండి
Sanju Samson Gives Clarity On Reported Fight With SRH Batsman Heinrich Klaasen Through Instagram Post

ఈ మ్యాచ్ జరిగిన రెండు రోజుల తర్వాత బుధవారం నాడు సంజు శాంసన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. క్లాసెన్‌ను తాను కౌగిలించుకున్న ఒక ఫోటోను షేర్ చేస్తూ ఆటలో భాగంగా గ్రౌండ్‌లో కొన్ని విషయాలు జరుగుతుంటాయని కానీ బయట మాత్రం క్లాసెన్ అంటే తనకు ఎంతో ప్రేమ గౌరవం ఉందని సంజు రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు 2024 నాటి తమిళ సినిమా సత్యం సుందరంలోని పాటను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా జోడించారు. మైదానంలో గొడవలు జరిగినప్పటికీ వ్యక్తిగతంగా వారి మధ్య ఉన్న మంచి బంధాన్ని గౌరవాన్ని ఈ పోస్ట్ తెలియజేసింది.

సూరీడుకి గుడ్ బై: T20 కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్..?

సూరీడుకి గుడ్ బై: T20 కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్..?
Sanju Samson Gives Clarity On Reported Fight With SRH Batsman Heinrich Klaasen Through Instagram Post

మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ కూడా సంజు శాంసన్‌తో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..బ్రదర్ నీపై నాకు చాలా ప్రేమ,గౌరవం ఉంది. నువ్వు ఆడే ఆట నాకు బాగా ఇష్టం ఇలాగే ఎప్పుడూ బాగా ఆడు. మన మధ్య ఎలాంటి గొడవలూ లేవు అంతా బాగుంది. వచ్చే మ్యాచ్‌లో మళ్లీ కలుద్దాం అని క్లాసెన్ రాసుకొచ్చాడు.

Story first published: Wednesday, May 20, 2026, 15:41 [IST]
Other articles published on May 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+