Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీఎస్కే ఏరికోరి తెచ్చుకుంటే.. ఇలా కొంపముంచావేంటి బ్రో?

ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరడంతో శాంసన్ గడ్డు కాలం ఈ సీజన్‌లోనూ కొనసాగుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ పోరులో శాంసన్ ఒక ఫోర్ కొట్టిన మరుసటి బంతికే తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. పంజాబ్ బౌలర్ జేవియర్ బార్ట్లెట్ అద్భుతమైన బంతితో శాంసన్‌ను బోల్తా కొట్టించాడు.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచెజీ అంటేనే ఓ పక్కా ప్లానింగ్. ఐపీఎల్ వేలంలో ఆచితూచి ఆటగాళ్లను ఎంచుకునే సీఎస్కే.. ఐపీఎల్ 2026 కోసం సంజు శాంసన్‌ను భారీ అంచనాలతో జట్టులోకి తెచ్చుకుంది. రుతురాజ్ గైక్వాడ్‌కు తోడుగా టాపార్డర్‌లో సంజు శాంసన్ ఉంటే బ్యాటింగ్ లైనప్ తిరుగుండదని భావించిన జట్టు యాజమాన్యానికి సంజు శాంసన్ ప్రస్తుత ఫామ్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో కూడా సంజు శాంసన్ కేవలం 7 పరుగులకే పెవిలియన్ చేరి జట్టును కష్టాల్లో నెట్టాడు.

Sanju Samson Flops Again in IPL 2026 Chennai Super Kings Fans Fuming as Opener Departs for 7 vs Punjab Kings

ఏరికోరి తెచ్చుకుంటే.. ఇలాగేనా
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తీరు చూసి ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. ఓ ఫోర్ కొట్టిన ఆ మరుసటి బంతికే సంజు శాంసన్ తన వికెట్‌ను పారేసుకున్నాడు. పంజాబ్ బౌలర్ జేవియర్ బార్ట్‌లెట్ సంజు శాంసన్ బలహీనతను ఆసరాగా చేసుకుని వికెట్లకు దగ్గరగా బంతులు విసరగా.. సంజు ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఎడ్జ్ ఇచ్చి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. వేలంలో భారీ ధర చెల్లించి, ఎంతో నమ్మకంతో ఓపెనర్‌గా పంపిస్తే.. ఇలా వరుసగా విఫలమవ్వడం సీఎస్కే శిబిరాన్ని ఆందోళనలో పడేసింది.

ఒత్తిడిలో కెప్టెన్ రుతురాజ్
సంజు శాంసన్ వరుస వైఫల్యాల వల్ల కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై భారం పెరుగుతోంది. గత మ్యాచ్‌ల్లో కూడా సంజు శాంసన్ త్వరగా అవుట్ అవ్వడంతో బ్యాటింగ్ కుప్పకూలిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా రెండో ఓవర్లోనే వికెట్ పడటంతో చెన్నై ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. క్రీజులో నిలబడి భారీ స్కోరు సాధించాల్సిన స్టార్ ప్లేయర్.. బాధ్యతారహితమైన షాట్‌తో అవుట్ అవ్వడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఆదుకున్న యువ సంచలనం ఆయుష్ మాత్రే
సంజు శాంసన్ వల్ల జరిగిన నష్టాన్ని టీమిండియా అండర్-19 ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఆయుష్ మాత్రే పూడ్చాడు. ఓ వైపు సీనియర్ ఆటగాడు సంజు శాంసన్ చేతులెత్తేస్తే, ఆయుష్ మాత్రే మాత్రం అద్భుతమైన పోరాట పటిమను కనబరిచాడు. కేవలం 43 బంతుల్లో 73 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. సంజు విఫలమైన చోట ఈ యువ ప్లేయర్ మెరుపులు మెరిపించడంతో సీఎస్కే భారీ స్కోరు సాధించగలిగింది.

సంజు శాంసన్ శాంసన్ మారాలి.. లేదంటే కష్టమే!
సీఎస్కే అభిమానులు సంజు శాంసన్ తన ఆట తీరును మార్చుకోవాలని కోరుకుంటున్నారు. ఓ స్టార్ ఓపెనర్‌గా జట్టును గెలిపించాల్సిన బాధ్యత సంజు శాంసన్‌పై ఉంది. కేవలం ఒకట్రెండు షాట్లు కొట్టి అవుట్ అవ్వడం వల్ల జట్టు ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. మరి రాబోయే మ్యాచ్‌ల్లోనైనా సంజు తన ఫామ్ పుంజుకుని సీఎస్కే యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి

Story first published: Friday, April 3, 2026, 22:36 [IST]
Other articles published on Apr 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+