న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Danish Kaneria : సంజూ శాంసన్ నీ స్పెషల్ ఎక్కడ..? పంత్ లాంటి బ్యాటర్ కాదు సంజూ

 Sanju Samson didnt Utilize Opportunity To Make His Place Fixed

భారత వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్ 2015లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసినప్పటికీ.. స్థిరమైన ప్రదర్శనలు అతను నమోదు చేయకపోవడంతో పాటు జాతీయ జట్టులో తీవ్ర పోటీ ఉండడంతో భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో మరోసారి విఫలమయ్యాడు. ఈ విషయమై పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా స్పందించాడు. సెలెక్టర్లను ఆకట్టుకునే అద్భుతమైన అవకాశాన్ని సంజూ శాంసన్ వృథా చేసుకున్నాడని తెలిపాడు. ఇకపోతే ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన తొలి వన్డేలో ఈ కేరళ క్రికెటర్ కేవలం 12పరుగులకే ఔటయి పెవిలియన్ బాట పట్టాడు. రొమారియో షెపర్డ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా శాంసన్ అవుట్ అయ్యాడు. రివ్యూ కోరుకున్నా.. అంపైర్ కాల్ రావడంతో అతనికి నిరాశ తప్పలేదు.

వన్డే ప్రపంచకప్ జట్టులోనైనా చోటు కోసం..

వన్డే ప్రపంచకప్ జట్టులోనైనా చోటు కోసం..

2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి శాంసన్..14 టీ20లు, రెండు వన్డేలు మాత్రమే ఆడగలిగాడు. ఇక టీ20ల్లో శాంసన్ 251 పరుగులు చేయగా.. వన్డేల్లో 58పరుగులు చేశాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులో శాంసన్‌కు చోటు దక్కడం దాదాపు కష్టమే. ఈ క్రమంలో వచ్చే ఏడాది సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోవడానికి శాంసన్ రాణించాల్సిన అవసరముంది. కాగా అతను తొలి వన్డేలో తన మార్క్ చూపించలేకపోయాడు. ఇక రెండో, మూడో వన్డేల్లోనైనా సత్తా చాటి అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్ నుంచి అతనికి తీవ్ర పోటీ ఉంది.

శాంసన్.. పంత్ లాంటి బ్యాటర్ కాదు

శాంసన్.. పంత్ లాంటి బ్యాటర్ కాదు

'శాంసన్‌కు మరో అవకాశం వచ్చింది కానీ అతను పెద్దగా ఏం స్పెషల్ ప్రదర్శన చేయలేదు. రొమారియో షెపర్డ్ అతనిని అవుట్ చేసే ముందు అతను చాలా నిస్తేజంగానే కనిపించాడు. ఇకపోతే దీపక్ హుడా గురించి ఇక్కడ మాట్లాడాలి. అతన్ని ఎందుకు డౌన్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు పంపించారు. శ్రేయాస్, సూర్యకుమార్ వరుసగా 3, 4స్థానాల్లో ఆడడం పర్వాలేదు. అయితే దీపక్ హుడా 5వ స్థానంలో రావాల్సింది. అంటే శాంసన్ కంటే ముందే రావాలి. కానీ రిషబ్ పంత్ తరహాలోనే శాంసన్‌ను 5వ స్థానంలో టీమ్ పంపించింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. శాంసన్ పంత్ లాంటి బ్యాటర్ కాదు. అతని బ్యాటింగ్ శైలి పూర్తిగా భిన్నమైంది. అతన్ని 6వ స్థానంలో పంపించాల్సింది' అని కనేరియా తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

మ్యాచ్ విన్నరే కానీ..

మ్యాచ్ విన్నరే కానీ..

రెగ్యులర్ వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ విశ్రాంతి కారణంగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక కాలేదు. దీంతో సంజూ శాంసన్‌కు మంచి అవకాశమొచ్చింది. ఈ సిరీస్‌కి వికెట్ కీపర్ల స్థానాల్లో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఎంపికయ్యారు. ఇకపోతే ఆదివారం జరిగే రెండో గేమ్‌లో కూడా సంజూ శాంసనే బరిలోకి దిగే అవకాశముంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ అవకాశం వస్తే అతను కచ్చితంగా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సంజూ లాంటి బ్యాటర్ ఎంతటి మ్యాచ్ విన్నరో మనందరికి తెలిసిందే. అతను రాణించాలని భారత అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

Story first published: Sunday, July 24, 2022, 17:26 [IST]
Other articles published on Jul 24, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X