For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sanju Samson: జాక్‌పాట్ కొట్టేసిన సంజూ శాంసన్.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు!

Sanju Samson: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్‌పై డబ్బుల వర్షం కురిసింది. కేరళ క్రికెట్ లీగ్(KCL) రెండో సీజన్‌లో సంజూ శాంసన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచారు. ఈ దిగ్గజ ఆటగాడిని కొచ్చి బ్లూ టైగర్స్ రూ.26.60 లక్షలకు కొనుగోలు చేసింది. సంజూ శాంసన్ బేస్ ధర రూ.3 లక్షలు కావడం విశేషం. కొచ్చి జట్టు సంజూ శాంసన్‌ను రికార్డు ధరకు కొనుగోలు చేసి తమ జట్టులో చేర్చుకుంది. కొచ్చి జట్టు ఆయన్ను రికార్డు ధరకు కొనుగోలు చేసి తమ జట్టులో చేర్చుకుంది. ఈ ఫ్రాంచైజీ రూ.50 లక్షల బిడ్డింగ్‌లో సగానికి పైగా మొత్తాన్ని సంజూ శాంసన్‌పైనే ఖర్చు చేసింది. ఇది కేరళలో సంజూ శాంసన్ ఎంత పెద్ద ఆటగాడో తెలియజేస్తోంది. వేలం సమయంలో ఒక దశలో త్రిస్సూర్ టైటాన్స్ జట్టు సంజూ శాంసన్ కోసం పోటీ పడింది. వారు రూ.20 లక్షలు బిడ్ చేశారు, కానీ ఆ తర్వాత కొచ్చి బ్లూ టైగర్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ బిడ్‌ను పెంచి సంజూ శాంసన్‌ను తమ సొంతం చేసుకుంది.

కొచ్చి సగానికి పైగా డబ్బును సంజూ శాంసన్ పైనే ఖర్చు చేసింది..
తిరువనంతపురంలో జరిగిన వేలంలో అన్ని జట్ల బిడ్డింగ్ మొత్తం రూ.50 లక్షలు. అంటే ఒక జట్టు గరిష్టంగా రూ.50 లక్షలు మాత్రమే ఖర్చు చేయగలదు. ఈ పరిస్థితుల్లో కొచ్చి బ్లూ టైగర్స్ తమ సగానికి పైగా డబ్బును సంజూ శాంసన్‌పైనే ఖర్చు చేసింది. ఈ నిర్ణయం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది, కానీ సంజూ శాంసన్ స్థాయిని బట్టి ఏ జట్టు అయినా ఆయన కోసం ఇలా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్‌లో కొచ్చి బ్లూ టైగర్స్ కోసం సంజూ శాసన్ ఏం చేస్తాడో చూడాలి.

Sanju Samson Becomes Most Expensive Player in KCL Season 2 Auction

ఈ ఆటగాళ్లపైనా డబ్బుల వర్షం
సంజూ శాంసన్‌తో పాటు కేరళ సహచరుడు విష్ణు వినోద్ పైనా భారీగా డబ్బు కురిసింది. ఆయన ఈ సీజన్‌లో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచారు. ఆయన్ను ఆరీస్ కొల్లం రూ.13.8 లక్షలకు కొనుగోలు చేసింది. అలాగే జలజ్ సక్సేనాను అలప్పీ రిపుల్స్ రూ.12.4 లక్షలకు తమ జట్టులో చేర్చుకుంది.

చివరిసారిగా ఐపీఎల్ 2025లో కనిపించిన సంజూ శాంసన్
సంజూ శాంసన్ చివరిసారిగా ఐపీఎల్ 2025లో కనిపించాడు. 18వ సీజన్‌లో గాయం కారణంగా సంజూ చాలా మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. సంజూ శాంసన్ అందుబాటులో లేకపోవడంతో ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించాడు. ఐపీఎల్ 2025లో సంజూ శాంసన్ 9 మ్యాచ్‌లలో 36 సగటుతో, 140 స్ట్రైక్ రేట్‌తో ఆయన 285 పరుగులు చేశాడు. ఇప్పుడు సంజూ శాంసన్ మరోసారి సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ కనిపించనున్నాడు.

సంజూ శాంసన్ టీ20 కెరీర్ ఎలా ఉంది?
సంజూ శాంసన్ టీ20 క్రికెట్‌లో దూకుడుగా ఆడే ఓపెనర్‌లలో ఒకరు. తన కెరీర్‌లో ఈ కుడిచేతి వికెట్ కీపర్- బ్యాటర్ 304 మ్యాచ్‌లలో 29.68 సగటుతో 7629 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ బ్యాట్ నుంచి 6 సెంచరీలు, 48 అర్ధ సెంచరీలు వచ్చాయి.

Story first published: Saturday, July 5, 2025, 14:34 [IST]
Other articles published on Jul 5, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+