లక్నో జట్టు పేరు ప్రకటించిన సంజీవ్ గోయెంకా.. లోగో అదిరిపోయిందిగా!

ఐపీఎల్‌లో కొత్తగా అడుగుపెట్టిన లక్నో జట్టు పేరును ఆ టీం మేనేజ్‌మెంట్ రివీలు చేసింది. ఆ జట్టును లక్నో సూపర్ జెయింట్స్ అని పిలవనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జట్టు యజమాని సంజీవ్ గోయెంకా ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా టీం లోగోను కూడా ఆవిష్కరించారు. ఈ లోగో ఆకట్టుకుంటుంది. ఓ వీడియో ద్వారా గోయెంకా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా ఈ సందర్భంగా తమ కొత్త జట్టు లక్నో టీం పట్ల అభిమానులు చూపిస్తున్న ఆదరణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భవిష్యత్‌లోనూ తమ టీంకు పూర్తి సహకారం అందించాలని సంజీవ్ గోయెంకా కోరారు.
రికార్డు ధరకు లక్నో టీం కొనుగోలు
కాగా ఐపీఎల్‌లో చరిత్రలోనే అత్యధిక ధరకు సంజీవ్ గోయెంకా లక్నో జట్టును కొనుగోలు చేశారు. ఈ జట్టును సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్పీఎస్జీ గ్రూప్ రికార్డు స్థాయిలో ఏకంగా 7,090 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. లక్నోతో పాటు అహ్మదాబాద్ కూడా ఈ సారి ఐపీఎల్‌లో చేరడంతో ఈ లీగ్‌లో మొత్తం 10 జట్లు పాల్గొనబోతున్నాయి. దీంతో 10 సంవత్సరాల తర్వాత ఐపీఎల్‌లో మళ్లీ 10 జట్లు పాల్గొననుండడం గమనార్హం.

కెప్టెన్‌గా రాహుల్
ఇటీవల బీసీసీఐకి లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను సమర్పించింది. మొత్తం ముగ్గురు ఆటగాళ్లకు ఈ జాబితాలో చోటు లభించింది. లక్నో రిటెన్షన్ జాబితా ప్రకారం ఈ సారి లీగ్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక మరో ఇద్దరిని ఆస్ట్రేలియాకు చెందిన ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను తమ జాబితాలో చేర్చింది. ఇందుకు గాను రాహుల్‌కు అత్యధికంగా 17 కోట్ల రూపాయలను చెల్లించడానికి లక్నో యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే మార్కస్ స్టోయినిస్‌కు 9.2 కోట్ల రూపాయలు, 4 కోట్ల రూపాయలు చెల్లించనుంది.

మెంటార్‌గా గంభీర్
లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్‌ను ఆ జట్టు మేనేజ్‌మెంట్ చాలా రోజుల కిందనే నియమించుకుంది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ రిటెన్షన్ జాబితాలో గంభీర్ కీలక పాత్ర పోషించాడని సమాచారం. ఇక ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 2 సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన గౌతం గంభీర్‌పై లక్నో ఫ్రాంచైజీ భారీ అంచనాలు పెట్టుకుంది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో గంభీర్ ఎలాంటి కీలక పాత్ర పోషిస్తాడో వేచి చూడాల్సి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications