బిడ్డ ముకుల్.. నువ్వు తోపు రా! (వీడియో)
కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో యువ బ్యాటర్ ముకుల్ చౌదరి తన అద్భుత ప్రదర్శనతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ థ్రిల్లింగ్ విక్టరీ తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా స్టేడియంలో ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. సాధారణంగా సీరియస్‌గా కనిపించే ఆయన.. ముకుల్ చౌదరి ఇన్నింగ్స్ చూసి మురిసిపోయారు.
ముకుల్‌ను హత్తుకుని.. బుగ్గలు నిమిరి..
మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలోకి వచ్చిన సంజీవ్ గోయెంకా నేరుగా ముకుల్ చౌదరి దగ్గరకు వెళ్లి అతడిని ఆలింగనం చేసుకున్నారు. చాలా సేపు ముకుల్ చౌదరితో ముచ్చటించిన సంజీవ్ గోయెంకా.. ఎంతో వాత్సల్యంతో ఆ యువ ఆటగాడి బుగ్గలు నిమిరి ప్రశంసించారు. ఓ యజమాని తన టీమ్ ప్లేయర్ పట్ల ఇంత ఎమోషనల్‌గా స్పందించడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముకుల్ చౌదరి వీరవిహారం
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఓ దశలో కష్టాల్లో పడింది. కానీ ముకుల్ చౌదరి ఒత్తిడిని దరిచేరనీయకుండా అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. కేవలం 27 బంతుల్లోనే 54 పరుగులతో అజేయంగా నిలిచి లక్నోను గెలిపించాడు. ఇన్నింగ్స్ చివరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగినప్పటికీ.. ముకుల్ చౌదరి ఏ మాత్రం తడబడకుండా ఫినిషర రోల్‌ను సమర్థవంతంగా పోషించి కేకేఆర్ నోటికాడ ముద్దను లాగేసుకున్నాడు.
ముకుల్ చౌదరి రూపంలో రాత్రికి రాత్రే కొత్త స్టార్
ఈ మ్యాచ్‌తో ముకుల్ చౌదరి రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. కోట్లాది మంది క్రికెట్ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్నాడు. ముఖ్యంగా ఓ యువ ఆటగాడు ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో చూపిన పరిపక్వత చూసి దిగ్గజ క్రికెటర్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సంజీవ్ గోయెంకా చూపిన ఈ ఆప్యాయత ముకుల్ చౌదరి భవిష్యత్ కెరీర్‌కు ఎంతో స్ఫూర్తినిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications