Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'టీమిండియాలో ముస్లిం ఆటగాళ్లకు చోటివ్వరా?'

హైదరాబాద్: గుజరాత్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్‌ ఓ వివాదాస్పద ట్వీట్‌తో వార్తల్లో నిలిచారు. న్యూజిలాండ్‌తో టీ20, శ్రీలంకతో టెస్టు సిరీస్‌లకు బీసీసీఐ సెలక్టర్లు సోమవారం జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఇద్దరు యువ ఆటగాళ్లుకు అవకాశం దక్కింది.

అందులో ఒకరు హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ సిరాజ్‌ కాగా, మరొకరు ముంబైకి చెందిన శ్రేయస్‌ అయ్యర్‌. ఈ జట్టు ఎంపిక అనంతరం సంజీవ్ భట్ అనే ఐపీఎల్ ఆఫీసర్ 'టీమిండియాలో ముస్లిం ఆటగాళ్లకు చోటివ్వరా?' అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

'భారత జట్టులో ముస్లిం ఆటగాళ్లు ఎందుకు లేరు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇప్పటివరకు ఇలా ఒక్క ముస్లిం సభ్యుడు లేకుండా ఉన్న సందర్భాలు ఎన్ని ఉన్నాయి. ముస్లింలు క్రికెట్ ఆడటం మానేశారా? లేక సెలక్టర్లు మరెవరి బాటలోనో వెళ్తున్నారా?' అంటూ పరోక్షంగా ప్రధాని మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌కు టీమిండియా వెటనర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. టీమిండియాకు మతం రంగు పులుమొద్దంటూ సున్నితంగా హెచ్చరించాడు. 'ప్రతి క్రికెటర్‌ జాతీయ జట్టుకు ఆడే సమయంలో భారతీయుడిగానే భావిస్తాడు. అంతేకానీ వారికి వారి మతంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఆటగాళ్ల ఎంపిక మతం, కులాన్ని బట్టి జరగదు. జై భారత్‌ప్రతి క్రికెటర్‌ జాతీయ జట్టుకు ఆడే సమయంలో భారతీయుడిగానే భావిస్తాడు. అంతేకానీ వారికి వారి మతంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఆటగాళ్ల ఎంపిక మతం, కులాన్ని బట్టి జరగదు. జై భారత్‌' అని భజ్జీ ట్వీట్ చేశాడు.

మరోవైపు అభిమానుల సైతం సంజీవ్ భట్‌పై మండిపడుతున్నారు. ప్రస్తుతం మహ్మద్ షమి టీమిండియాలో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న విషయాన్ని భట్ మరిచిపోయినట్లు ఉన్నాడంటూ నెటిజన్లు చురకలించారు. గతంలో అజారుద్దీన్‌, ఇర్ఫాన్‌పఠాన్‌, మహమ్మద్‌ కైఫ్‌, యూసుఫ్‌ పఠాన్‌ టీమిండియాకు ఆడిన సంగతి తెలిసిందే.

ఎవరీ సంజీవ్ భట్
గతంలో 2002 గుజరాత్ అల్లర్ల కేసులో మోడీ పాత్రపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. అప్పట్లో ముస్లింలపై దాడులు చేయాలని మోడీ హిందువులకు పిలుపునిచ్చిన మీటింగ్‌కు తాను వెళ్లినట్లు భట్ చెప్పాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఓ వివాదాస్పద ట్వీట్‌తో వార్తల్లో నిలిచాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+