Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'రోహిత్, జైశ్వాల్ దెబ్బేశారు.. కనీసం మీ ఇద్దరైనా న్యాయం చేయండి!'

సీనియర్ క్రికెటర్స్ వల్ల జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశాలు చేజారుతున్నాయని అన్నాడు ముంబయి చీఫ్‌ సెలక్టర్ సంజయ్‌ పాటిల్. బీసీసీఐ కండిషన్ మేరకు రీసెంట్ గా టీమిండియా స్టార్ క్రికెటర్స్ దేశవాళీ బరిలోకి దిగారు. రంజీ ట్రోఫీ మ్యాచులు ఆడారు. ఈ నేపథ్యంలో జట్టులో స్టార్ ప్లేయర్స్ కు చోటు కల్పించేందుకు.. పలువురు యంగ్ ప్లేయర్స్ బెంచ్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఈ కారణంగానే సంజయ్ పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

అలానే తాజాగా జరగనున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌ల కోసం ముంబయి జట్టులోకి సూర్యకుమార్ యాదవ్, శివమ్‌ దూబె వచ్చారు. వారు నామమాత్రపు ప్రదర్శన చేయకుండా.. నాణ్యమైన ఆటతీరు కనబరిచేందుకు ప్రయత్నించాలని సూచించాడు సంజయ్ పాటిల్. ఎందుకంటే ఇటీవలే జమ్మూకశ్మీర్ తో జరిగిన మ్యాచ్ లో.. తమ జట్టులో (ముంబయి) రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, శ్రేయస్‌ అయ్యర్, అజింక్య రహానె వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఓడిపోవడం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నాడు.

suryakumar yadav shivam dube

"దేశవాళీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తోన్న భారత క్రికెటర్లు నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవలే ఆరుగురు స్టార్ ప్లేయర్లు ఉన్న మా టీమ్.. జమ్మూకశ్మీర్‌ చేతిలో ఓడిపోయింది. దాని వల్ల అది తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాను. అందుకే, ఇప్పుడు రంజీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్న సూర్య కుమార్‌, దూబెకు ఓ సలహా ఇస్తున్నాను. నామమాత్రపులా కాకుండా.. నాణ్యమైన, అద్భుత ప్రదర్శన చేయాలని కోరుతున్నాను. గత మ్యాచ్‌లో స్టార్‌ ప్లేయర్స్ కోసం కుర్రాళ్లను బెంచ్‌కే పరిమితం చేశారు. అయినప్పటికీ గెలుపొందలేదు. కాబట్టి ముంబయి కోసం ఆడేటప్పుడు వందశాతం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నించండి." అని సంజయ్‌ పాటిల్ పేర్కొన్నాడు.
Story first published: Wednesday, February 5, 2025, 16:28 [IST]
Other articles published on Feb 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+