
ముప్పు ఉందనే తప్పుకున్నాడు
''టీమిండియాలో తన కెప్టెన్సీకి ముప్పు ఉందని భావించే విరాట్ కోహ్లీ తనకు తానుగా తప్పుకున్నాడు. ఏదో ఒక కారణంతో తనను తొలగించే అవకాశం ఇతరులకు ఇవ్వొద్దని భావించి ఉంటాడు. ఈ మధ్య కాలంలో కోహ్లీ విషయంలో చాలా తక్కువ కాలంలోనే అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. చూస్తుండగానే వైట్ బాల్ కెప్టెన్సీకి దూరమయ్యాడు. ఆర్బీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇవన్నీ తక్కువ కాలంలోనే జరగడం ఆసక్తికరంగా మారింది.'' అని మంజ్రేకర్ అన్నాడు.

కోహ్లీపై ద్రావిడ్ ప్రభావం
ఇటీవల భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ప్లేసులో రాహుల్ ద్రావిడ్ రావడం విరాట్ కోహ్లీపై ఎక్కువగా ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రి నుంచి లభించినంత మద్దతు తనకు ద్రావిడ్ నుంచి లభించిదని కోహ్లీ భావించినట్లు ఉన్నాడని ఆయన చెప్పాడు. అనిల్ కుంబ్లే కోచ్‌గా ఉన్నప్పుడు అతనితో విరాట్ కోహ్లీ విభేదించాడని గుర్తు చేశాడు. అంతేకాకుండా కుంబ్లే కోచ్‌గా తప్పుకునేలా చేశాడని చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ నిర్ణయాలన్నీ కూడా భావోద్వేగంతో కూడుకున్నవని తెలిపాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ బ్యాటర్‌గా కూడా గతంలో మాదిరిగా రాణించలేక పోతున్నాడని అన్నాడు. ప్రస్తుతం కోహ్లీ కంఫర్ట్ జోన్‌లో లేడని సంజయ్ మంజ్రేక్ తెలిపాడు.

కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై
సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా ఓటమి పాలైన అనంతరం కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన భారత్ తొలి టెస్టు మ్యాచ్ గెలిచి మంచి ఊపులో కనిపించింది. కానీ అనూహ్యంగా ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి ఏకంగా సిరీస్‌నే కోల్పోయింది. బౌలర్లు స్థాయికి తగ్గట్టు రాణించినప్పటికీ బ్యాటర్లు రాణించకపోవడమే టీమిండియా కొంప ముంచింది.


Click it and Unblock the Notifications












