India vs Australia: 'నటరాజన్ రాక.. ఇక షమీకి జట్టులో స్థానం కష్టమే'

కాన్‌బెర్రా: శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20తో భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లోకి టీ నటరాజన్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అరంగేట్ర మ్యాచ్‌లోనే నట్టూ అదరగొట్టాడు. 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన నటరాజన్.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేతో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన నట్టూ.. 2 వికెట్లు తీసి సత్తాచాటిన సంగతి తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా లాగే నట్టూ కూడా తన పదునైన యార్కర్లతో స్టార్ బ్యాట్స్‌మన్‌లను సైతం బోల్తా కొట్టిస్తున్నాడు. మూడో వన్డే, తొలి టీ20లో అద్భుత యార్కర్లు సందించాడు.

స్లో యార్కర్‌కు స్టార్క్ బౌల్డ్:
వన్డే సిరీస్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఎల్బీడబ్ల్యూ చేసి టీ20ల్లో తొలి వికెట్‌ను ఖాతాలో వేసుకున్న టీ నటరాజన్.. 15వ ఓవర్లలో ఓపెనర్ డార్సీ షార్ట్ (34)ను ఔట్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు మలుపు తిప్పాడు. ఇక ఇన్నింగ్స్ చివర్లో స్లో యార్కర్‌తో మిచెల్ స్టార్క్‌ను బౌల్డ్ చేశాడు. బంతుల్లో వైవిధ్యం, యార్కర్లతో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను నిలువరించిన నట్టూ.. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, అతడు జట్టుకు ఆయుధంగా మారుతాడని మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలు గుప్పించాడు.

షమీకి కష్టమే:
భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్.. టీ నటరాజన్ ప్రదర్శపై ప్రసంశలు కురిపించాడు. నటరాజన్ రాకతో టీ20 ఫార్మాట్‌లో మొహమ్మద్ షమీకి కష్టమేనంటూ పేర్కొన్నాడు. సోనీసిక్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ మాట్లాడుతూ... 'టీ20 స్పెషలిస్ట్‌గా తుది జట్టులోకి వచ్చిన నటరాజన్.. తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. నా దృష్టిలో మొహమ్మద్ షమీ స్థానాన్ని నటరాజన్ భర్తీ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇక పొట్టి ఫార్మాట్‌లో షమీ స్థానం పదిలంగా ఉంటుందా అన్న అనుమానం కలుగుతుంది' అని పేర్కొన్నాడు.

బుమ్రాకు సరిజోడి:
'డెత్ ఓవర్లలో నటరాజన్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఐపీఎల్ 2020లో కూడా అతని ప్రదర్శనను చూశాం. భారత మరో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సరిజోడిగా కనిపిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇద్దరూ అద్భుతంగా యార్కర్లు వేయగలరు. అందుకే టీ20 ఫార్మాట్‌లో మొహమ్మద్ షమీకి స్థానం కష్టమే అని అంటున్నా' అని సంజయ్ మంజ్రేకర్ వివరించాడు. తొలి టీ20లో ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆపై ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 150 రన్స్ మాత్రమే చేసింది.

ఐపీఎల్ 2020లో 16 వికెట్లు:
ఐపీఎల్ 2020లో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చిన నటరాజన్‌ను బీసీసీఐ సెలెక్టర్లు ఆసీస్ పర్యటనకు ఎంపిక చేశారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరపున 16 వికెట్లు తీసిన నటరాజన్.. యార్కర్ల స్పెషలిస్ట్‌గా ముద్ర వేశాడు. ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా అతని ప్రదర్శనను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేతో అరంగేట్రం చేసిన నటరాజన్ మార్నస్ లబుషేన్ వికెట్ తీసి మెయిడెన్ వికెట్ తీశాడు.తొలి టీ20లో తన వంతు పాత్ర పోషించాడు.
'జడేజాను ఎందుకు పరీక్షించలేదు.. భారత్ కంకషన్ సబ్‌స్టిట్యూట్ లొసుగును వాడుకుంది'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications