ట్విటర్‌తో నాకు మంచి కంటే నష్టమే ఎక్కువ జరిగింది!అందరూ ఇష్టపడేలా ట్వీట్లు ఎలా చేయాలో తెలియట్లేదు!

ముంబై: సోషల్ మీడియాను తాను ఇప్పటికీ అర్థం చేసుకోలేక పోతున్నానని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ట్విటర్ వల్ల తనకు లాభం కన్నా.. నష్టమే ఎక్కువగా జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అందరూ ఇష్టపడేలా ట్వీట్లు ఎలా చేయాలో ఇప్పటికీ తనకు అర్థమవ్వడం లేదని మంజ్రేకర్ అంటున్నాడు. సంజయ్ మంజ్రేకర్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడన్న విషయం తెలిసిందే. ప్రతిసారి ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ అందరి ఆగ్రహానికి గురవవుతుంటాడు. అయినా తన పంతా మార్చుకోవడం లేదు.

నోటి దురుసు ఎక్కువ:
నిజానికి క్రికెట్ వ్యాఖ్యానం చేయడంలో సంజయ్ మంజ్రేకర్ దిట్ట. ఇంగ్లీష్ బాగా మాట్లాడగలడు. అంతేకాదు ఆట పరంగా విశ్లేషణ కూడా బాగుంటుంది. అయితే అతడికి కాస్త నోటి దురుసు ఎక్కువ. ఈ క్రమంలో కొన్నిసార్లు సహచరులు, ఆటగాళ్లపై చేసే వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. గతంలో భారత స్టార్ ఆటగాడు రవీంద్ర జడేజాపై చేసిన 'బిట్స్ అండ్ పీసెస్' అతడికి చేటు చేసింది. హర్ష భోగ్లేను అవమానిస్తూ మాట్లాడడం కూడా వివాస్పదం అయింది. దీంతో కొన్నాళ్లు వ్యాఖ్యానం చేయకుండా బీసీసీఐ నిషేధించింది. అయినా కూడా మంజ్రేకర్‌లో ఎలాంటి మార్పు రాలేదు.

పెద్ద దుమారమే:
ఇటీవల తన ఆల్‌టైం గ్రేట్ పుస్తకంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంకా చోటు దక్కించుకోలేదని ట్వీట్ చేశాడు. దానిపైనా పెద్ద దుమారం రేగింది. అశ్విన్ మంచి స్పిన్నరే కావచ్చు కానీ.. ఆల్‌టైమ్ గ్రేట్‌లో ఒకడు మాత్రం కాదని మంజ్రేకర్ అభిప్రాయపపడ్డాడు. ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ అయింది. మాజీలు అందరూ మంజ్రేకర్‌పై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మంజ్రేకర్ సోషల్ మీడియా గురించి మాట్లాడాడు. మంజ్రేకర్ భారత్ తరఫున 37 టెస్టులు, 74 వన్డేలు ఆడాడు. మొత్తంగా 5 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు బాదాడు. రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.

ఎక్కువ సార్లు చెడే చేసింది:
'ట్విటర్ రెండువైపులా పదునైన కత్తి. కొన్ని సందర్భాల్లో నాకు మంచి చేస్తే.. ఎక్కువ సార్లు చెడే చేసింది. సమతూకం కోసం ప్రయత్నించినా.. నష్టాన్నే ఎక్కువ కలిగించింది. సోషల్ మీడియా ఒక మృగంలా అనిపిస్తోంది. దానిని అర్థం చేసుకోలేకపోతున్నా. నేనెన్నో టెక్నిక్‌లు ప్రయత్నించాను. ఇప్పటికీ సోషల్ మీడియాలో పోస్టులు ఎలా పెట్టాలో అర్థం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నా. అందరూ ఇష్టపడేలా ట్వీట్లు ఎలా చేయాలో మరి' అని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఓ జట్టని మంజ్రేకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక మార్పు మినహా.. ఈ రోజు అదే జట్టు ఫైనల్ ఆడుతోంది.

సంజయ్ మంజ్రేకర్ జట్టు:
శుభమన్ గిల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications