Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: 'ఓపెనింగ్ స్లాట్ మ్యూజికల్ చైర్ లాంటిది.. శిఖర్ ధావన్ డేంజర్‌​ జోన్‌లో ఉన్నాడు'

Sanjay Manjrekar said Shikhar Dhawan has taken backseat in race for T20I opening spot
IND vs ENG : T20Is Opening Slot Race - Tough Road For Dhawan VS KL Rahul, Ishan Kishan || Oneindia

అహ్మదాబాద్: శిఖర్ ధావన్.. ఒకప్పుడు టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కీలక ఓపెనర్. కుడి-ఎడమ కలయిక కారణంగా టెస్ట్, వన్డే, టీ20లలో ఓపెనర్‌గా ఆడాడు. గతకొంత కాలంగా గబ్బర్ ఫామ్ కోల్పోవడం, గాయాలు కావడం, యువ ఆటగాళ్లు జట్టులోకి రావడంతో బీసీసీఐ సెలెక్టర్లు ఇప్పుడు అతడిని టెస్టులకు పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే పరిమిత ఓవర్లకు మాత్రం ఎంపికవుతూ మ్యాచులు ఆడుతున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో విఫలమవడంతో.. రెండో టీ20లో అతని స్థానంలో ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌ చేశాడు. ఇషాన్‌ తన తొలి మ్యాచులోనే అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ధావన్ ప్లేస్ డేంజర్ జోన్‌లో పడింది. ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

డేంజర్‌​ జోన్‌లో ధావన్:

డేంజర్‌​ జోన్‌లో ధావన్:

సంజయ్‌ మంజ్రేకర్ తాజాగా ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. టీమిండియా ఓపెనింగ్‌ జోడీపై స్పందించాడు. 'ఎప్పుడైనా భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ఓపెనర్‌గా కచ్చితంగా ఉంటాడు. మూడో టీ20కి రోహిత్ జట్టులోకి వస్తుండడం భారత క్రికెట్‌కు శుభవార్త. అయితే మితవారిపైనా కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. వారు ప్రతి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేయాలి. ఇప్పటి పరిస్థితుల దృష్యా చూసుకుంటే శిఖర్‌ ధావన్ డేంజర్‌​ జోన్‌లో ఉన్నాడు. ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌ నుంచి తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో గబ్బర్ ఒక అడుగు వెనుకపడినట్లే' అని మంజ్రేకర్ అన్నాడు.

మ్యూజికల్ చైర్‌లా ఉంది:

మ్యూజికల్ చైర్‌లా ఉంది:

'ఇషాన్‌ కిషన్ అద్భుతంగా ఆడాడు. అతడిని ఇప్పుడు పక్కకు తప్పించే అవకాశాలు లేవు. లోకేష్ రాహుల్‌ రెండేళ్లుగా టీ20ల్లో బాగా ఆడుతున్నాడు. అతడు ఏ స్థానంలో ఆడడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అతని గురించి ఎక్కువ ఆలోచించనవసరం లేదు. శిఖర్ ధావన్ విషయంలోనే కాస్త ఆందోళన ఉంది. అతను మొదట్నుంచి ఓపెనింగ్‌ స్థానంలోనే బ్యాటింగ్‌ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఫామ్ కోల్పోయాడు. మొదటి రెండు టీ20లకు దూరమైన రోహిత్‌ మూడో టీ20లో కచ్చితంగా ఆడుతాడు. అలా చూసుకుంటే గబ్బర్ రేసు నుంచి వెనుకబడ్డట్లే. ప్రస్తుతం ఓపెనింగ్ స్లాట్ మ్యూజికల్ చైర్‌లా ఉంది' అని సంజయ్‌ మంజ్రేకర్ పేర్కొన్నాడు.

జట్టులో ప్రయోగాలు:

జట్టులో ప్రయోగాలు:

రానున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని టీమిండియా మేనేజ్‌మెంట్.. జట్టులో పలు ప్రయోగాలు చేస్తోంది. ‌ఇందులో భాగంగా కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తోంది. ముఖ్యంగా ఓపెనింగ్‌ స్థానంలో చాలామంది ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌ కూడా ఓపెనర్‌ స్థానానికి పోటీలో ఉండడం.. ఇదివరకు టీమిండియా ఓపెనర్‌గా సత్తా చాటిన శిఖర్‌ ధావన్‌తో పాటు తాజాగా ఇషాన్‌ కిషన్‌ వచ్చి చేరాడు. దీంతో రెగ్యులర్ రోహిత్‌ శర్మతో ఎవరిని ఓపెనింగ్‌ ఆడించాలనేది పెద్ద తలనొప్పిగా మారింది. ఏదేమైనా మూడో టీ20లో మాత్రం ఇషాన్‌ ఓపెనర్‌గా రానున్నాడు.

భారత తుది జట్టు (అంచనా):

భారత తుది జట్టు (అంచనా):

భారత్‌: విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, ఇషాన్‌ కిషన్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చహల్‌.

Story first published: Tuesday, March 16, 2021, 13:50 [IST]
Other articles published on Mar 16, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+