ఆ గాయంతో చస్తావా? వీవీఎస్ లక్ష్మణ్‌పై గ్రేగ్ చాపెల్ చిందులు! ఎప్పుడంటే!

VVS Laxman పై ఆగ్రహంతో ఊగిపోయిన Greg Chappell అదేమైనా అంత ప్రాణాపాయమైన గాయమా ? || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రేగ్ చాపెల్ కోచ్‌గా ఉన్న కాలం భార‌త క్రికెట్‌లో అత్యంత చెత్త సమయని నాటి ఆటగాళ్లు ఇప్పటికీ అంటుంటారు. 2005-07 మధ్య కాలంలో భారత జట్టు కోచ్​గా పనిచేసిన గ్రేగ్​ చాపెల్ భారత క్రికెట్ నాశనాన్ని కోరుకున్నాడనంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అడ్డమైన ప్రయోగాలతో జట్టును భ్రష్టుపట్టించాడు. భారత క్రికెట్ చరిత్రలోనే ఓ వివాదస్పద కోచ్​గా మిగిలిపోయిన గ్రేగ్​ ఛాపెల్​.. ఒకానొక సందర్భంలో మాజీ క్రికెటర్​ వీవీఎస్​ లక్ష్మణ్​పై కోపడ్డాడట! 2005 జింబాబ్వే పర్యటన సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్​ మంజ్రేకర్ తాజాగా​ వెల్లడించాడు.

స్లిప్ క్యాచ్ వదలడంతో..

స్లిప్ క్యాచ్ వదలడంతో..

తాజాగా స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మణ్‌పై చాపెల్ అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేశాడని గుర్తు చేసుకున్నాడు. కోచ్ ప్రవర్తన పట్ల లక్ష్మణ్ షాక్‌కు గురయ్యాడని చెప్పుకొచ్చాడు. ‘2005లో జింబాబ్వే పర్యటన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. గాయం కారణంగా వీవీఎస్ లక్ష్మణ్ మైదానం వీడాడు. అతని స్థానంలో మైదానంలోకి దిగిన సబ్‌స్టిట్యూట్ ప్లేయర్​ స్లిప్స్​లో ఓ క్యాచ్​ను జారవిడిచాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన చాపెల్.. అక్కడ ఫీల్డింగ్​ చేయాల్సిన లక్ష్మణ్ ఎందుకు లేడంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు'అని నాటి సంఘటనను మంజ్రేకర్ గుర్తు చేసుకున్నాడు.

చనిపోయేంత గాయమా?

చనిపోయేంత గాయమా?

ఆ టైమ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ డ్రెస్సింగ్ రూమ్‌లో కాఫీ తాగుతున్నాడని, అతని దగ్గరికి వచ్చి చాపెల్ అనరాని మాటలు అన్నాడని మంజ్రేకర్ తెలిపాడు. ‘ఆ సమయంలో డ్రెస్సింగ్​ రూమ్​లో కాఫీ తాగుతున్న వీవీఎస్ లక్ష్మణ్‌ను ఫీల్డ్​ నుంచి ఎందుకు వచ్చావంటూ చాపెల్ ప్రశ్నించాడు. గాయం కారణంగా మైదానం వీడానని, ఐస్ పెట్టుకోవడానికి వచ్చానని లక్ష్మణ్ బదులిచ్చాడు. అయినప్పటికీ.. అదేమైనా అంత ప్రాణాపాయమైన గాయమా? అని గ్రెగ్​ చాపెల్ అసహనం వ్యక్తం చేశాడు. అలాంటి సందర్భం వస్తే కానీ.. మైదానంలో నుంచి బయటకు రావద్దని మందలించాడు. దాంతో లక్ష్మణ్​ షాక్​కు గురయ్యాడు.'అని మంజ్రేకర్ పేర్కొన్నాడు.

స్థంభించిన భారత పార్లమెంట్..

స్థంభించిన భారత పార్లమెంట్..

భారత క్రికెట్‌లోనే ఓ విప్లవం తీసుకొచ్చిన దాదా.. 2005లో చాపెల్‌ కారణంగా కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కెప్టెన్సీతో పాటు జట్టులో చోటునే కొల్పోయాడు. గంగూలీని తప్పించాలని బీసీసీఐకి చాపెల్ రాసిన మెయిల్ లీకవ్వడం అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపింది. భారత పార్లమెంట్‌ను కూడా స్థంభింపచేసింది. అనంతరం సత్తా చాటిన దాదా 2006లో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ జట్టు పగ్గాలను మాత్రం అందుకోలేకపోయాడు. ఇక చాపెల్ ప్రయోగాలు బెడిసి కొట్టడంతో 2007 ప్రపంచకప్‌లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కనీసం లీగ్ స్టేజ్ కూడా దాటకుండా ఇంటిదారిపట్టింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, May 9, 2021, 15:38 [IST]
Other articles published on May 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X