వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఓకే.. మరి సంజూ శాంసన్ ఎక్కడ?
ఇంగ్లాండ్ జట్టుతో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ తో భారత తుది జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్‌ను పక్కనపెట్టి.. టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడంపై సంజయ్ మంజ్రేకర్ ప్రశ్నలు సంధించాడు. ఒకవేళ సంజూ శాంసన్‌కు ఎలాంటి గాయం కాకుండా కేవలం జట్టు నుంచి డ్రాప్ చేసి ఉంటే మాత్రం ఇది అత్యంత విచిత్రమైన జట్టు ఎంపిక అవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు.
ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసి యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయస్సులోనే టీమిండియా జెర్సీ ధరించిన వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మహిళా క్రికెటర్ షఫాలీ వర్మల రికార్డులను బద్దలు కొట్టి.. అతి పిన్న వయస్సులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. అయితే తన అరంగేట్ర మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కేవలం 10 బంతుల్లో 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

వైభవ్ అరంగేట్రంపై సంజయ్ మంజ్రేకర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ జట్టు యాజమాన్యంపై మండిపడ్డాడు. "టీమిండియా జెర్సీలో వైభవ్ సూర్యవంశీని చూడటం సంతోషంగానే ఉంది. కానీ సంజూ శాంసన్ పరిస్థితి ఏంటి? అతడిని జట్టు నుంచి తీసేశారా? జోక్ చేస్తున్నారా ఏంటి అని ప్రశ్నించాడు. ఒకవేళ సంజూ శాంసన్ ఏదైనా గాయం కారణంగానే ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని తాను ఆశిస్తున్నానని.. ఒకవేళ అది నిజం కాకపోతే మాత్రం ఈ ఎంపిక అసలు అర్థం లేనదని సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఒకవేళ సెలెక్టర్లు వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని అనుకుంటే.. సంజూ శాంసన్ ను మూడో స్థానంలో బ్యాటింగ్ కు పంపి.. ఇద్దరినీ తుది జట్టు కాంబినేషన్లో ఉంచే వీలుండేదని సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. సంజయ్ మంజ్రేకర్ చేసిన ఈ కామెంట్ల తర్వాత సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ మధ్య చర్చ మొదలైంది. చాలా మంది అభిమానులు సంజూ శాంసన్‌ను పక్కనపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం వైభవ్ సూర్యవంశీని భవిష్యత్తు స్టార్‌గా అభివర్ణిస్తూ ఈ సెలెక్షన్‌ను సమర్థిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications