Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రంజీ ఫైనల్: విదర్భ విజయం వెనుక ముంబై ఆటగాళ్లు

Sanjay Manjrekar gets trolled on Twitter for commenting on Vidarbha winning Ranji Trophy

హైదరాబాద్: టీమిండియా మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ మరోసారి చులకన భావంతో ట్వీటల దుమారానికి గురయ్యాడు. చరిత్రలో తొలిసారి రంజీ విజేతగా నిలిచిన విదర్భ జట్టులో ఇద్దరు ముంబయి ఆటగాళ్లు ఉన్నారని వ్యంగ్యంగా ట్టీట్ చేశాడు.

Vidarbha Cricket Association Reward Ranji Team With Rs 3 Crore

ఢిల్లీతో జరిగిన రంజీ ఆఖరి పోరులో విదర్భ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయోత్సాహంలో ఉన్న విదర్భపై ట్వీట్‌ మంజ్రేకర్ ట్వీట్ విసిరాడు. ఈ నేపథ్యంలో మంజ్రేకర్‌పై విమర్శలు వస్తున్నాయి.

క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాల్సిన సమయంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. 'వారూ మీలాగే ప్రొఫెషనల్‌ క్రికెటర్లే. వ్యాఖ్యతగా మీరు అందరి గురించీ ఒకేలా మాట్లాడాలి.

విదర్భ జట్టు‌కు నిర్వహణ నైపుణ్యాలు బాగున్నాయని, ముంబై ప్రతిభగల క్రీడాకారులను కోల్పోతున్నట్లు మీ ట్వీట్‌ ద్వారా అర్థం తెలుస్తుంది.

మేం ఏం చెప్పాలని అనుకుంటున్నామో మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నా' అని ఒకరు మంజ్రేకర్‌కు బదులిచ్చారు. ఇలాగే చాలామంది ట్వీట్లు చేశారు.

విదర్భ క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌, కోచ్‌ పండిట్‌ను ఉద్దేశించి సంజయ్‌ ట్వీట్‌ చేశారని తెలుస్తోంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 3, 2018, 10:06 [IST]
Other articles published on Jan 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+