For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: 'బుమ్రా చాలా అమాయకుడు.. అండర్సన్‌ను రెచ్చగొట్టాలన్నది ఆ ప్లేయర్ ప్రణాళికే'

Sanjay Manjrekar feels Virat Kohli may ask Jasprit Bumrah to Bowl Bouncers to James Anderson

ముంబై: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా చాలా అమాయకుడు అని భారత మాజీ ఆటగాడు, స్టార్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. సాధారణంగా బుమ్రా మైదానంలో గాని బయట గాని ఎవరినీ కవ్వించడని, తన పనేదో తాను చేసుకుపోతాడన్నాడు. నిజానికి ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను రెచ్చగొట్టాలన్నది కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రణాళిక కావొచ్చన్నాడు. ప్రత్యర్థి జట్టులో ప్రధాన ఆటగాడిని కవ్వించాలన్నది కోహ్లీ ఉద్దేశం కావొచ్చని మంజ్రేకర్ పేర్కొన్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో గెలిచి.. ఐదు టెస్టుల సిరీసులో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య లీడ్స్‌లో ఈనెల 25 నుంచి మూడో టెస్ట్‌ ప్రారంభం కానుంది.

బుమ్రాను తోసేసి:

బుమ్రాను తోసేసి:

లార్డ్స్‌ టెస్టులో భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల ఆటగాళ్లు పరస్పరం కవ్వించుకున్న సంగతి తెలిసిందే. మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన జేమ్స్ అండర్సన్‌కు జస్ప్రీత్ బుమ్రా షార్ట్‌ పిచ్‌ బంతులు వేయడంతో అసలు కథ మొదలైంది. కొన్ని బంతులు దేహానికి తగలడంతో జిమ్మీ ఆవేశపడ్డాడు. అతడికి సారీ చెబుదామని వెళ్లిన బుమ్రాను తోసేసి బూతులు తిట్టాడు. ఇది అన్యాయమని, కావాలనే బంతులు వేశావని రెచ్చగొట్టాడు.ఆ తర్వాతి రోజు బ్యాటింగ్‌కు వచ్చిన బుమ్రాకు ఇంగ్లండ్ పేసర్లు షార్ట్‌ పిచ్‌ల బంతులు విసిరి గాయపర్చాలని భావించారు. కానీ అది బెడిసికొట్టింది. దాంతో మాటల దాడి చేశారు. పదేపదే బుమ్రాను దూషించారు.

బుమ్రా స్వభావం అది కాదు:

బుమ్రా స్వభావం అది కాదు:

ఈ విజయంపై భారత మాజీ భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ... 'పదకొండో నంబర్ ఆటగాడు జేమ్స్ అండర్సన్‌కు జస్ప్రీత్ బుమ్రా 150 మైళ్ల వేగంతో బంతులు వేశాడు. పుల్‌ లెంగ్త్‌, షార్ట్‌ పిచ్‌ బంతులతో దేహానికి గురిపెట్టాడు. వరుస బంతులను అలానే సంధిస్తూ వచ్చాడు. అప్పటివరకు 140-145 మైళ్ల వేగంతో బంతులు సంధించే పేస్ గుర్రం ఒక్కసారిగా వేగం పెంచాడు. సాధారణంగా ఇది బుమ్రా స్వభావం కాదు. అతడు వేగంగా బంతులేస్తూ వికెట్లకు గురిపెడతాడు. అలా చేసుంటే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ ఇంకా త్వరగానే ముగిసేది' అని అన్నాడు.

కోహ్లీ ప్రణాళిక అయ్యుంటుంది:

కోహ్లీ ప్రణాళిక అయ్యుంటుంది:

'షార్ట్‌ పిచ్‌ బంతులు వేయాలన్నది బహుశా టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ప్రణాళిక అయ్యుంటుంది. దానిని పేసర్ జస్ప్రీత్ బుమ్రా అమలు చేశాడు. బహుశా ఇంగ్లండ్ ప్రధాన ఆటగాడైన జేమ్స్ అండర్సన్‌ను రెచ్చగొట్టాలనో లేదా రెచ్చగొట్టి శాంతింపజేయాలనో లేదా అతడిని గాయపర్చాలనో ఇలా చేసుండొచ్చు. దాంతో ఇంగ్లీష్ ప్లేయర్స్ డీలా పడతారని అనుకోవచ్చు' అని సంజయ్‌ మంజ్రేకర్ పేర్కొన్నాడు. సాధారణంగా బుమ్రా మైదానంలో గాని బయట గాని ఎవరినీ కవ్వించడని, తన పనేదో తాను చేసుకుపోతాడన్నాడు. బుమ్రా చాలా మంచివాడు అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

పనేసర్‌ మరోలా:

పనేసర్‌ మరోలా:

తాజాగా ఇదే విషయమై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్‌ మాట్లాడుతూ... 'భారత టెయిలెండర్లను మాటలతో రెచ్చగొట్టాలనేది ఇంగ్లండ్ కోచ్‌ క్రిస్ సిల్వర్‌వుడ్‌ ఆలోచన. కానీ భారత్‌ ఏ మాత్రం తగ్గలేదు. మా జట్టులోని ఒక్క ఆటగాణ్ని మీరు లక్ష్యంగా చేసుకుంటే.. మేమందరం కలిసి మీ వెంటపడతాం అన్నట్లు వ్యవహరించింది. ఆ వ్యూహం టీమిండియాకు ఫలితాన్ని అందించింది. జస్ప్రీత్ బుమ్రాను దూషిద్దామని ఇంగ్లీష్ ప్లేయర్స్ అనుకున్నారు. కానీ విరాట్ కోహ్లీ ఎలా స్పందిస్తాడోనని వాళ్లు అసలు ఊహించలేకపోయారు. విరాట్ అన్ని విషయాలనూ గమనించి తిరిగి ఇంగ్లండ్‌పై ఎదురు దాడి చేశాడు. తన ఆటగాళ్లను ప్రత్యర్థులు ఏమైనా అంటే అసలు ఊరుకోడు' అని అన్నాడు.

Story first published: Sunday, August 22, 2021, 10:41 [IST]
Other articles published on Aug 22, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+