
హైదరాబాద్: భారత క్రికెట్‌లో ప్రస్తుతం మ్యాచ్‌ని మలుపు తిప్పగల బుమ్రా, భువనేశ్వర్ లాంటి బౌలర్లు ఉన్నప్పటికీ ఇంకా సూపర్ స్టార్లు రావాల్సిన అవసరం ఉందని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో యంగ్ జనరేషన్‌కు ప్రేరణగా నిలిచే బౌలర్లు రావాలని అన్నాడు.
'భారత క్రికెట్ జట్టులో అందరి దృష్టి బ్యాటింగ్ మీదే ఉంటుంది. పాకిస్థాన్ సంగతి అలా కాదు. ఎప్పుడు ఆ జట్టును చూసినా సూపర్ స్టార్లందరూ బౌలర్లే. ఇమ్రాన్ ఖాన్, వసీమ్, వకార్.. ఇలా బౌలర్లే ఆ దేశంలో హీరోలు' అని 52 ఏళ్ల సంజయ్ మంజ్రేకర్ ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు.
'బ్యాటింగ్‌లో భారత్ గొప్ప ఆటగాళ్లను అందించింది. కానీ బౌలింగ్‌లో మాత్రం లేదు. ప్రస్తుతం బుమ్రా, భువనేశ్వర్ లాంటి ఆటను మలుపు తిప్పే ఆటగాళ్లను చూస్తున్నాం. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డులను కూడా సొంతం చేసుకుంటున్నారు. ఈ పరిణామం మంచిది' అని అన్నాడు.
'అయితే బ్యాట్స్‌మెన్‌ను ఆరాధించినట్లు బౌలర్లనూ ఆరాధించి వారిని హీరోలుగా చేయాల్సింది అభిమానులే. భారత్‌కు బౌలింగ్ సూపర్‌స్టార్లు రావాలి. అలా వస్తే తర్వాతి తరాలపై సానుకూల ప్రభావం ఉంటుంది. మనకు ప్రపంచంలోనే అత్యుత్తమ అకాడమీలు, మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. క్రికెట్ అనేది యువ క్రికెటర్లను ప్రభావం చేయాలి' అని మంజ్రేకర్ పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.