
ఒకే తపనతో ఆడతాడు:
'టెస్టుల్లో విరాట్ కోహ్లీ దాదాపుగా 7500 పరుగులు.. 27 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్ అంటే విరాట్ ప్రాణం పెట్టి ఆడతాడు. ఇలా అంటున్నా అంటే.. టీ20, వన్డే క్రికెట్ ఇష్టం లేదని కాదు. అన్నిటినీ కోహ్లీ ఒకే తపనతో ఆడతాడు. కానీ అతడికి ఆత్మసంతృప్తి ఇచ్చేది మాత్రం టెస్ట్ క్రికెట్టే. కానీ ప్రతి మ్యాచ్ విలువైందే. ప్రతి జట్టు ఫలితం కోసమే ఆడుతోంది. అందుకే బ్యాట్స్‌మెన్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి' అని సంజయ్ బంగర్ అన్నారు. స్టార్ స్పోర్ట్స్ షో 'క్రికెట్ కనెక్టడ్'లో సంజయ్ బంగర్ మాట్లాడుతూ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్ గురించి మాట్లాడాడు.

కచ్చితంగా బుర్రలో పెట్టుకుంటాడు:
'ప్రతి మ్యాచులో రాణించేందుకు సెంచరీల కరవు తీర్చుకోవాలని విరాట్ కోహ్లీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంగ్లండ్ సిరీసులో అతడు దీనిని కచ్చితంగా బుర్రలో పెట్టుకుంటాడు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన విధానం అతడు మంచి లయలో ఉన్నాడనేందుకు సంకేతం. ఇది టీమిండియాకు మంచి చేస్తుంది' అని సంజయ్ బంగర్ పేర్కొన్నారు. సౌథాంప్టన్ వాతావరణం, వర్షం వల్ల ఆటగాళ్ల ఏకాగ్రత కచ్చితంగా దెబ్బతినే ఉంటుందని ఆయన అంచనా వేశాడు. వికెట్‌లోనూ మార్పులు వస్తుంటాయని చెప్పుకొచ్చారు.

బ్యాటింగ్‌లో గడ్డు కాలం:
విరాట్ కోహ్లీ గత ఏడాదిన్నర కాలంగా బ్యాటింగ్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై చివరిసారిగా సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కొద్దిసార్లు మాత్రమే 70, అంతకుమించిన పరుగులు సాధించాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి ఇప్పటికే 70 శతకాలు సాధించిన కోహ్లీ.. ఇటీవల ముగిసిన టెస్ట్ ఛాంపియన్‌షిఫ్ ఫైనల్లోనూ విఫలమయ్యాడు. త్వరలో ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌లోనైనా 71వ శతకం అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2008లో క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఏడాది శతకం సాధిస్తూ వచ్చాడు టీమ్కోహ్లీ. 2020లో మాత్రమే అతడు మూడెంకల స్కోరు అందుకోలేకపోయాడు.


Click it and Unblock the Notifications












