కుల్‌దీప్‌కు ఐపీఎల్ 2020 ఎంతో కీలకం.. రాణిస్తేనే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు!!

ముంబై: భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌కు ఐపీఎల్ 2020 ఎంతో కీలకం. ఆ టోర్నీలో రాణిస్తేనే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కేందుకు అవకాశాలు ఉంటాయని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌పై కుల్‌దీప్ చివరి టీ20 ఆడాడు. దాదాపు తొమ్మిది నెలల విరామం తర్వాత కుల్‌దీప్ టీమిండియాకు జట్టులో చోటు దక్కించుకున్నాడు.

కుల్‌దీప్‌కు పెద్ద అభిమానిని
డిసెంబర్ 6 నుండి భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్‌లో కుల్‌దీప్ యాదవ్‌కు టీమిండియా సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. కుల్‌దీప్ మళ్లీ జట్టులోకి రావడంతో సంజయ్ బంగర్ మీడియాతో పలు విషయాలను పంచుకున్నారు. 'కుల్‌దీప్ మంచి బౌలర్. అతని స్ట్రైక్ రేట్లకు పెద్ద అభిమానిని. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టాడు. టీ20 క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇంగ్లాండ్‌లో కూడా ఐదు వికెట్లు తీశాడు' అని బంగర్ అన్నారు.

ఐపీఎల్ 2020 ఎంతో కీలకం
'ఐపీఎల్ 2019 సీజన్ కుల్‌దీప్ యాదవ్‌కు అస్సలు కలిసిరాలేదు. కొన్ని మ్యాచ్‌లలో రాణించకపోవడంతో అతన్ని పక్కనపెట్టారు. అందుకే ఐపీఎల్ 2020 ఎంతో కీలకం. ఆ టోర్నీలో రాణిస్తేనే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. అతడు రాణిస్తే జట్టు నుంచి పక్కన పెట్టడం కష్టం' అని బంగర్ పేర్కొన్నారు.

జడేజా ప్రపంచకప్ జట్టులో ఉండాలి
'టీ20 ఫార్మాట్లో మణికట్టు స్పిన్నర్లు కీలకం. రెండేళ్లుగా భారత మణికట్టు స్పిన్నర్ల ప్రదర్శనను చూశాం. టీ20ల్లో 4 ఓవర్లు వేసి 7వ స్థానంలో బ్యాటింగ్ చేయగల సమర్థులు అవసరం. ఈ విషయంలో కృనాల్ పాండ్య కన్నా రవీంద్ర జడేజా చాలా బెటర్. ప్రస్తుతం జడేజా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. జడేజా ప్రపంచకప్ జట్టులో ఉండటం అవసరం' అని బంగర్ అభిప్రాయపడ్డారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications