ఏడో స్థానంలో ధోనీని పంపడంపై ఎట్టకేలకు నోరువిప్పిన సంజయ్ బంగర్

Sanjay Bangar Opens Up On MS Dhoni's Batting Position In World Cup Semi-Final || Oneindia Telugu

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టన్ మహేంద్ర సింగ్ ధోనిని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఎట్టకేలకు స్పందించాడు. ధోనిని ఏడో స్థానంలో బ్యాటింగ్ పంపాలనే నిర్ణయం తాను ఒక్కడే తీసుకున్న నిర్ణయం కాదని అన్నాడు.

విండిస్ పర్యటన షురూ: Ist T20I: మ్యాచ్ టైమింగ్, ఎక్కడ చూడాలి

వరుణుడు ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ (3/37) విజృంభణతో కుప్పకూల్చాడు. 10 ఓవర్లలోపే 24 పరుగులకే టీమిండియా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరారు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(77)తో కలిసి మహేంద్ర సింగ్ ధోని(50) నిలకడగా ఆడుతూ ఏడో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయం దిశగా జట్టుని నడిపించాడు. అయితే, దురదృష్టవశాత్తూ మార్టిన్ గుప్టిల్... ధోనీని రనౌట్ చేయడంతో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఆ అధికారం లేదు: బీసీసీఐకి కేంద్ర క్రీడాశాఖ మధ్య చిచ్చు పెట్టిన పృథ్వీ షా నిషేధం

బంగర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు

బంగర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు

ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో దినేశ్ కార్తీక్, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా... అనంతరం ధోనీని క్రీజులోకి పంపడం అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ కారణంగా టీమిండియా ఓటమిపాలైందన్న విమర్శలు సైతం వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ధోనీని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై

ధోనీని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై

ధోనీని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై సంజయ్ బంగర్ ఎట్టకేలకు స్పందించాడు. "ధోనీని ఏడో స్థానంలో పంపాలన్న నిర్ణయం నా ఒక్కడిది కాదు. నన్ను నమ్మండి... మేము చాలా పరిస్థితులను అంచనా వేసి ఈ నిర్ణయానికి వచ్చాం. నెంబర్ 5, 6, 7 స్థానాలకు సంబంధించి మిడిల్ ఆర్డర్‌లో సరళంగా ఉండాలని మేము నిర్ణయించుకున్నాం, ఎందుకంటే 30-40 ఓవర్ స్లాబ్‌ను గరిష్టంగా పెంచాలని చూశాము" అని అన్నాడు.

కోహ్లీ సైతం ఇదే

కోహ్లీ సైతం ఇదే

"ఇది ప్రతి ఒక్కరికీ తెలుసు.. సెమీ పైనల్స్‌కు ముందు ఆప్ఘనిస్థాన్ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ధోనీని లోయర్ ఆర్డర్‌లో వెనక్కు పంపాలని(అప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ధోని నంబర్. 5 స్థానంలో ఆడాడు). 35వ ఓవర్ తర్వాత ముఖ్యంగా డెత్ ఓవర్లలో ధోని ఎలా ఆడతాడో మనకు తెలుసు. ఈ కారణం చేతనే సెమీస్‌లో ధోనీని ఆరో స్థానంలో పంపాం" అని సంజయ్ బంగర్ తెలిపాడు.

డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించిన తర్వాతే

డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించిన తర్వాతే

"డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించిన తర్వాత దినేశ్ కార్తీక్‌ని నంబర్.5 స్థానంలో ప్రమోట్ చేశాం. అప్పటికే టాపార్డర్ కుప్పకూలడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ధోనీ అనుభవం కలిగిన ఆటగాడు కావడం... ఫినిషింగ్ జాబ్‌ను సమర్ధవంతంగా నిర్వహిస్తాడనే ధోనీని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాం" అని బంగర్ అన్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, August 2, 2019, 15:12 [IST]
Other articles published on Aug 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X