
టీమిండియా టీ20 జట్టు వైస్ కెప్టెన్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విభిన్న స్థానాల్లో విభిన్న పాత్రలను పోషించే బహుముఖ ప్రజ్ఞ కలిగిన ప్లేయర్ అంటూ టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఘనమైన పునరాగమనం చేశాడు. అతను కేవలం 12బంతుల్లో అజేయంగా 31పరుగులు చేయడంతో టీమిండియా స్కోరు 211పరుగులకు చేరుకుంది. ఇక బౌలింగ్లో హార్దిక్‌తో సహా మిగతా బౌలర్లు అందరూ విఫలం కావడం, రాస్సీ వాన్ డర్ డుస్సెన్, డేవిడ్ మిల్లర్ వీరబాదుడు బాదడంతో టీమిండియా ఓడిపోయింది. ఈ స్కోరును ఐదు బంతులు మిగిలి ఉండగానే ప్రోటీస్ జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.
గతేడాది టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా చివరిసారిగా టీమిండియా తరఫున ఆడాడు. ఆ తర్వాత అతను బ్యాక్ పెయిన్, ఇంజూరీ వల్ల ఇండియాకు ఆడలేకపోయాడు. ఇక దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపికైన హార్దిక్ తొలి మ్యాచ్‌లో మంచి పునరాగమనం చేశాడు. ఇక గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీలో రాణించిన సంగతి తెలిసిందే. ఇక తొలి టీ20లో శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అతను నంబర్ 5స్థానంలో అద్భుతంగా రాణించాడు. అప్పటికే ఇన్నింగ్స్‌లో అతి తక్కువ ఓవర్లు మిగిలి ఉండగా.. స్కోరు బోర్డును పరుగులెత్తించేలా వీరవిహారం చేశాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున 130 స్ట్రైక్ రేటు కలిగి ఉన్న పాండ్యా టీమిండియా కోసం ఆడుతున్నప్పుడు స్ట్రైక్ రేట్‌ను 250కంటే ఎక్కువ కలిగి ఉన్నాడు. టీ20లలో అతని బ్యాటింగ్ తీరును సంజయ్ బంగర్ కొనియాడాడు.
'అతను మల్టీ ఫేస్డ్ ప్లేయర్, అతను ఆట ఫౌండేషన్ విషయంలో చాలా తెలుసుకున్నాడు. అతన్ని నంబర్ 4లో, నంబర్ 6లో ఆడించొచ్చు. నేను హార్దిక్‌తో మాట్లాడినప్పుడల్లా.. నాకు ఆటలో మంచి ఫౌండేషన్ వేయాలని ఉంటుందని చెప్పేవాడు. అతను ఆ విషయమై చాలా శ్రద్ధ చూపేవాడు. అతనిలో వచ్చిన కీలక మార్పు ఇదే. తన ఆటను తాను ఆర్డర్ ప్రకారం చేసుకున్నాడు. పరిస్థితికి అనుగుణంగా ఆటతీరును కనబర్చుతున్నాడు.' అంటూ హార్దిక్ బ్యాటింగ్ నైపుణ్యాన్ని సంజయ్ మెచ్చుకున్నాడు.