Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sanjay Bangar : పాకిస్థాన్ టీంకు, ఇండియా టీంకు ప్రధాన తేడా అదే..!

Sanjay Bangar Felt that Teamindia is not Depend on Toporder like Pakistan

ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌‌లో పాకిస్థాన్ తమ టాపార్డర్‌పై ఎక్కువగా ఆధారపడుతుందని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. అక్టోబరు 23న పాకిస్థాన్‌తో ఇండియా టీ20ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ప్రధాన తేడాను బంగర్ వివరించాడు. 'బ్యాటింగ్ విభాగంలో బాబర్, రిజ్వాన్‌లపై పాకిస్థాన్ ఎక్కువగా ఆధారపడి ఉంది. భారత జట్టు విషయానికొస్తే భారత్ టాపార్డర్ మీద పెద్దగా ఆధారపడట్లేదు.

జట్టులో ప్రతి ఒక్కరు అవసరమైన టైంలో రాణించేవారే ఉన్నారు. ప్రస్తుతం బ్యాటింగ్ పరంగా భారత జట్టులో నలుగురైదుగురు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. వాళ్లందరూ కూడా ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి బ్యాటింగ్ పరంగా పాకిస్థాన్ కంటే భారత జట్టు మెరుగైన స్థితిలో ఉందని నేను భావిస్తున్నాను.' అని సంజయ్ బంగర్ అన్నాడు.

'బౌలింగ్ విభాగాన్ని పరిశీలిస్తే.. భారత్ కంటే పాకిస్థాన్ జట్టులో మంచి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఆ జట్టుకు ఎప్పుడు కూడా బౌలింగ్ ప్రధాన బలంగా ఉంటుంది. మన బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా ఉండుంటే బాగుండేది. అతను లేకున్నా.. జట్టులో దీపక్ చాహర్ ఉంటే అతని స్వింగ్ సామర్థ్యంతో మనకు కొంచెం ఇబ్బంది తప్పుతుంది.

అర్ష్‌దీప్ సింగ్ రూపంలో మనం ఎప్పటి నుంచో వెతుకుతున్న లెఫ్టార్మ్ బౌలర్ మనకు అందుబాటులో ఉన్నాడు. అతను బంతిని రెండు విధాలుగా స్వింగ్ చేయగల వ్యక్తి. భారత జట్టులో నిఖార్సైన స్పీడ్ బౌలర్ మాత్రం మిస్సయ్యాడని నేను భావిస్తున్నా. అయినప్పటికీ నైపుణ్యమున్న బౌలర్లు ఉండడం భారత్‌కు సరిపోతుంది.' అని బంగర్ అన్నాడు.

'ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ రెండుసార్లు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. భారత్ మొదటి మ్యాచ్‌లో గెలిచింది. సూపర్ 12లో పాకిస్థాన్ గెలుపొందింది. ఇకపోతే చిరకాల ప్రత్యర్థుల మధ్య ఇటీవలి మ్యాచ్‌ల గురించి బంగర్ మాట్లాడుతూ.. భారత్ ఇప్పుడు పూర్తిస్థాయి జట్టు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా రెండు టఫ్ అండ్ టఫ్ గేమ్స్ కలిగి ఉంది. మన జట్టు కేవలం ఒకరిద్దరి మీద ఆధారపడే జట్టు కాదు. అదే మన ప్లస్. పాకిస్థాన్ విషయంలో మాత్రం ఆ జట్టు ఒకరిద్దరు స్టార్ల మీదే ఆధారపడుతుంది.' అని బంగర్ వ్యాఖ్యానించాడు.

Story first published: Thursday, October 6, 2022, 18:43 [IST]
Other articles published on Oct 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+