
సానియా వ్యాఖ్యలకు వారు తీవ్రంగా బాధపడినట్లు కనిపించారు. ట్విట్టర్ పేజీలో సానియా సచిన్ టెండూల్కర్‌పై వ్యాఖ్యలు చేసింది. "Sachhinn saaccchhhhiiiinnnnnnnn...ENOUGH SAID" (సచిన్ చాలా చెప్పాడు అని సానియా వ్యాఖ్యానించింది.
అంతే ఆమెపై టెండూల్కర్ అభిమానులు సానియాపై తీవ్రంగా ప్రతిస్పందించారు. దాంతో ఆమె వారి ఆగ్రహాన్ని చల్లార్చడానికి ప్రయత్నించారు. ప్రజలు ఆంగ్లభాషను సరిగా అర్థం చేసుకోలేదని, చాలా చెప్పాడంటే సచిన్ చివరి మాటలు... ఏదైనా చెప్పడానికి తగినంత గౌరవం ఉందని దాని అర్థమని ఆమె వివరించారు.
అయితే, సచిన్ అభిమానులు సంతృప్తి చెందలేదు. అది భాషకు సంబంధించిన వ్యవహారం కాదని, మనోభావాలకు సంబంధించిందని అన్నారు. ఏమైనా, ఓ క్రీడాకారిణి అయి ఉండి, విశేషమైన అభిమానులను కలిగి ఉండి కూడా సానియా తోటి క్రీడాకారుడిపై అలా వ్యాఖ్యానించడం చాలా మందిని బాధపెట్టిందనే అంటున్నారు.