For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షోయబ్ మాలిక్‌పై సానియా మీర్జా షాకింగ్ కామెంట్స్!

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడిపోతున్నట్లు వార్తలు ప్రచారం సాగుతున్న తరుణంలో అతడి మూడో పెళ్లి అందర్నీ షాకింగ్ గురి చేసింది. సానియా మీర్జాను షోయబ్ మాలిక్ 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికీ షోయ‌బ్‌కు అది రెండో వివాహం కావడం గమనార్హం. తన తొలి భార్య అయేషా సిద్ధిఖితో విడాకుల అనంతరం సానియాను పెళ్లి చేసుకున్నాడు. తాజాగా పాకిస్థాన్ ప్రముఖ నటి సనా జావేద్‌ను మాలిక్ వివాహమాడాడు.

అయితే సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడిపోతున్నట్లుగా గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. సానియా మీర్జా చేసిన తాజా పోస్ట్‌ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. 'పెళ్లి కష్టం, విడాకులు కష్టమే. మీరు కఠినంగా ఉండి, సరైన దాన్ని ఎంచుకోండి. మనం ఎప్పుడూ మన కష్టాన్నే నమ్ముకోవాలి' అంటూ సానియా ఓ కొటేషన్‌ను తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే షోయబ్ మాలిక్‌తో సానియా విడాకులు తీసుకుందా లేదా అనే విషయంపై క్లారిటీ రాలేదు.

Sania Mirzas shocking comments on Shoaib Malik third marriage

తాజాగా సానియా మీర్జా కుటుంబం ఈ విషయంపై అధికారికంగా స్పందించింది. కొద్ది నెలల కిందటే వారిద్దరు విడాకులు తీసుకున్నారని షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అంతేగాక మూడో పెళ్లి చేసుకున్న షోయబ్‌కు సానియా శుభాకాంక్షలు తెలిపిందని చెబుతూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.

''సానియా తన వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా ఎప్పుడూ గోప్యంగానే ఉంచుతుంది. కానీ కొన్ని విషయాలు ఇప్పుడు పంచుకోవాల్సి వచ్చింది. షోయబ్‌ మాలిక్‌‌తో కొన్ని నెలల కిందటే సానియా విడాకులు తీసుకుంది. అలాగే షోయబ్‌ కొత్త ప్రయాణం బాగుండాలని కోరుకుంటూ సానియా శుభాకాంక్షలు తెలిపింది. ఈ సమయంలో సానియా గోప్యతకు అందరూ గౌరవం ఇవ్వాలని కోరుతున్నాం '' అని సానియా తరపున ప్రకటన విడుదల చేశారు.

కాగా, షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్న స‌నా జావేద్‌కు ఇది రెండో వివాహం. పాకిస్తాన్‌ కు చెందిన ఈ ప్ర‌ముఖ న‌టీ వయసు 28 ఏళ్లు. స‌నా అనేక టీవీ షోల్లో క‌నిపించింది. 2020లో సింగర్ ఉమైర్ జ‌స్వాల్‌ను ఆమె వివాహం చేసుకుంది. కానీ కొద్దికాలానికే ఈ దంప‌తుల మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. అయితే షోయబ్ మాలిక్ మూడో పెళ్లి వేడుకకు అతని కుటుంబ సభ్యులు హాజరవ్వలేదని పాకిస్థాన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సనా జావెద్‌ను పెళ్లి చేసుకోవడం మాలిక్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, సానియా మీర్జాతో విడాకులు తీసుకోవడాన్ని వారు సహించలేదని వార్తలు వస్తున్నాయి.

Story first published: Sunday, January 21, 2024, 15:05 [IST]
Other articles published on Jan 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+