Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బరువు తగ్గేందుకు జిమ్‌లో సానియా కసరత్తులు.. వీడియోలు చూస్తే!!

Sania Mirza sharing videos of her fitness journey after giving birth to baby boy

హైదరాబాద్: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే భారత స్టార్ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రస్తుతం నిత్యం వార్తల్లో ఉంటోంది. ఆటతో కాకుండా వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తోంది. పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌తో పెళ్లి, కుమారుడు ఇజాన్ పుట్టిన తర్వాత సానియా మీర్జా తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం సానియా జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేసిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

జిమ్‌లో కష్టపడుతున్న సానియా:

జిమ్‌లో కష్టపడుతున్న సానియా:

సానియా మీర్జా గర్భిణిగా ఉన్న సమయంలో అధిక బరువు పెరిగింది. ఇక తిరిగి కోర్టులో అడుగు పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే బరువు తగ్గించుకునేందుకు సానియా తీవ్రంగా శ్రమిస్తోంది. క్రమం తప్పకుండా జిమ్‌లో కసరత్తులు చేస్తూ చెమటోడ్చుతోంది. ఈ నేపథ్యంలో సానియా నాలుగు నెలల్లో 26 కేజీల బరువు తగ్గింది. తాజాగా జిమ్‌లో కష్టపడుతున్న కొన్ని వీడియోలను సానియా తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో పోస్ట్ చేసింది.

టెన్నిస్‌ ఆడేందుకు ఎంతో ఆతృతగా ఉన్నా:

టెన్నిస్‌ ఆడేందుకు ఎంతో ఆతృతగా ఉన్నా:

'దేశానికి ఆటడమే నా ధ్యేయం. కచ్చితంగా పూర్వ రూపు తెచ్చుకుంటా. టెన్నిస్‌ ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. నా శరీరం బలంగా మారింది. మానసికంగా కూడా సిద్ధంగా ఉన్నా. గతంలో చెప్పినట్టే శ్రమ, ఏకాగ్రత వల్లనే ఫిట్‌నెస్‌ సాధ్యమైంది' అని సానియా పేర్కొంది. సానియా నిబద్ధతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

4 నెలల్లో 26 కేజీలు:

అంతకుముందు చేసిన పోస్టులో.. 'ఇజాన్ పుట్టిన తర్వాత నా బరువు గురించి చాలా మంది ప్రశ్నించారు. కానీ.. ఇప్పుడు బరువు తగ్గడం ఎలా సాధ్యమైందని వారే అడుగుతున్నారు. డెలివరీ అనంతరం 23 కేజీల బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నా. జిమ్‌లో కస్టపడి 26 కేజీల బరువు తగ్గా. శ్రమ, ఏకాగ్రత వల్లనే ఇది సాధ్యమైంది' అని సానియా పేర్కొంది.

2017 చైనా ఓపెన్ చివరిది:

సానియా గతేడాది అక్టోబరులో ఇజాన్‌ మీర్జా మాలిక్‌కు జన్మనిచ్చింది. 2017లో చివరి సారిగా చైనా ఓపెన్ టోర్నీ ఆడింది. అప్పటినుంచి ఆమె ఆటకు దూరంగా ఉంది. 2020 జనవరిలోపు అంతర్జాతీయ పోటీలో పాల్గొంటానని ఇటీవలే సానియా తెలిపింది. సానియా ఇటీవలే పారిస్‌ వీధుల్లో చక్కర్లు కొట్టింది. సానియా సోదరి ఆనమ్ మీర్జా త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఆనమ్ మీర్జా తన బ్యాచిలర్‌ పార్టీని పారిస్‌లో ఏర్పాటు చేయడంతో ఇద్దరు సోదరీమణులు అక్కడ తెగ ఎంజాయ్ చేశారు.

Story first published: Saturday, October 12, 2019, 17:52 [IST]
Other articles published on Oct 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+