
హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. గత నెలలో సానియా మిర్జా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బాబుకి ఇజాన్ మీర్జా మాలిక్ అని సానియా-షోయబ్ దంపతులు నామకరణం కూడా చేసిన సంగతి తెలిసిందే.
అందరి సెలబ్రిటీ తల్లిదండ్రుల్లాగే సానియా-షోయబ్‌మాలిక్‌లు కూడా తమ చిన్నారిని ఇప్పుడిప్పుడే ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే ఇజాన్‌కు సంబంధించి ఎన్నో అనుభవాలను తన అభిమానులతో పంచుకున్న సానియా మిర్జా తాజాగా ఓ ట్వీట్ చేసింది.
"బాబుతో మధురమైన క్షణాలు" అంటూ క్యాప్షన్ ఇచ్చి ఇజాన్‌తో ఎత్తుకుని తీసుకున్న ఫొటోను సానియా తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ ఫోటోలో సానియా ఇజాన్ అని రాసి ఉన్న కోట్‌ను చిన్నారికి కప్పి అతడిని సానియా ఆప్యాయంగా హత్తుకున్నట్లు మనం చూడొచ్చు. ఇప్పటికే దీన్ని 23వేల మందికి పైగా లైక్ చేశారు.