ఆ పని ఇక్కడ చేస్తే.. భార్యకు బానిస అనేవాళ్లు: సానియా


హైదరాబాద్: ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో భారత్‌తో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఫైనల్లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ.. ఐదోసారి కప్పును ముద్దాడింది. ఓపెనర్ ఎలీసా హేలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. బెత్ మూనీ (54 బంతుల్లో 78 నాటౌట్; 10 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది.

సతీమణి ఫైనల్ మ్యాచ్ చూసేందుకు:
సతీమణి, ఆస్ట్రేలియా మహిళా ఓపెనర్ ఎలీసా హేలీ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఆస్ట్రేలియా పురుషుల జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో అప్పటికే ఆసీస్ 0-2తో వెనకబడిన కారణంగా.. చివరి వన్డే నామమాత్రమే కావడంతో స్టార్క్ మెల్‌బోర్న్ వెళ్ళడానికి క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతిచ్చింది. దీంతో ఆదివారం హేలీ సిడిగాలి ఇన్నింగ్స్ ఆడుతుంటే.. స్టార్క్ హాయిగా ఆస్వాదించాడు.

భార్యకు బానిస:
భార్య ఎలీసా హేలీ ఆటను చూసేందుకు మిచెల్ స్టార్క్ స్వదేశానికి రావడంపై భారత టెన్నిస్ స్టార్, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జా సరదాగా స్పందించింది. స్టార్క్ చేసిన పనికి ఉపఖండంలో అయితే అతడిని భార్యకు బానిస అనేవారు అని ట్వీట్ చేసింది. 'కచ్చితంగా చెప్పగలను. ఉపఖండానికి (భారత్, పాక్, బంగ్లాదేశ్) చెందిన వ్యక్తి (స్టార్క్) అయితే మరు క్షణంలోనే 'జోరూ కా గులాం' (భార్యకు బానిస) అని అనేవారు. స్టార్క్ మంచి పనిచేశాడు' అని సానియా ట్వీట్ చేసింది. గతంలో భర్తతో ఆమె ఎదుర్కొన్న వివాదాల కారణంగానే ఇలా అని ఉండొచ్చు.

బీరు సీసాతో ఎంజాయ్:
మైదానంలో సతీమణి ఎలీసా హేలీ విధ్వంసకర బ్యాటింగ్‌ను స్టార్క్ తెగ ఆస్వాదించాడు. చేతిలో బీరు సీసాతో ఎలీసా సూపర్ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశాడు. భర్తగా తన భార్య ఆటను చూసి ఉప్పొంగిపోయాడు. సిక్స్ కొట్టినప్పుడల్లా చీర్చ్ చెబుతూ.. తమ జట్టుకు మద్దతిచ్చాడు. సతీమణి ఆట.. భర్త సంబరాలను చూడటం కూడా ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా అనిపించింది.

అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ:
ఫైనల్ మ్యాచ్‌లో 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఎలీసా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఐసీసీ టోర్నీల ఫైనల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా రికార్డుకెక్కింది. ఇప్పటి వరకు టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా పేరిట ఈ రికార్డు ఉండగా.. తాజా ఎలీసా అధిగమించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ భారత్‌ల మధ్య జరిగిన ఫైనల్స్‌లో హార్ధిక్ 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications