Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డబ్ల్యూటీఏ ఫైనల్స్ విజేతగా సానియా జోడి(ఫోటోలు)

హైదరాబాద్: సింగపూర్‌లో జరుగుతున్న డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో టైటిల్ విజేతగా సానియా జోడి కైవసం నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో సానియా-హింగిస్ జోడి 6-0, 6-3 సెట్ల తేడాతో ముగురుజ్జా-సూరేజ్ నవరో (స్పెయిన్) జంటపై విజయం సాధించింది.

సింగపూర్‌లో జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో విజయం సాధించిన ఈ జోడి ఈ సీజన్‌లో మరో డబుల్స్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోవడం విశేషం. దీంతో ఈ జోడీ సాధించిన టైటిల్స్ సంఖ్య తొమ్మిదికి పెంచుకోగా, సానియా జోడికి ఇది వరుసగా 22వ విజయం. మొత్తంగా చూస్తే సానియా మిర్జా కెరీర్‌లో ఇది 32వ డబుల్స్ టైటిల్.

స్విస్‌కు చెందిన హింగిస్‌కు ఇది 50వ డబుల్స్ టైటిల్. కాగా, సానియా-హింగిస్ జోడి విజయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

డబ్ల్యూటీఏ ఫైనల్స్ విజేతగా సానియా-హింగిస్ జోడీ

డబ్ల్యూటీఏ ఫైనల్స్ విజేతగా సానియా-హింగిస్ జోడీ

గత సోమవారం జరిగిన డబుల్స్ తొలి మ్యాచ్‌లో సానియా-హింగిస్ జోడీ 6-4, 6-2తో రాకెల్ కాప్స్ జోన్స్-అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా) జంటపై విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. 75 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించి తొలి విజయాన్ని అందుకుంది.

డబ్ల్యూటీఏ ఫైనల్స్ విజేతగా సానియా-హింగిస్ జోడీ

డబ్ల్యూటీఏ ఫైనల్స్ విజేతగా సానియా-హింగిస్ జోడీ

బుధవారం జరిగిన ‘రెడ్ గ్రూప్' లీగ్ మ్యాచ్‌లో సానియా-హింగిస్ ద్వయం 6-3, 6-4తో ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించి దాదాపు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. 76 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్ లో సానియా జోడీకి రెండో సెట్ లో గట్టి పోటీ ఎదురైనా విజయాన్ని సొంతం చేసుకుంది.

డబ్ల్యూటీఏ ఫైనల్స్ విజేతగా సానియా-హింగిస్ జోడీ

డబ్ల్యూటీఏ ఫైనల్స్ విజేతగా సానియా-హింగిస్ జోడీ

శుక్రవారం జరిగిన చివరిదైన మూడో లీగ్ మ్యాచ్ లో సానియా జోడి 6-4, 7-5 తేడాతో తిమియా బాబోస్(హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)లపై గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. 90 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో సానియా గట్టి పోటీని ఎదుర్కొని పోరులో నిలబడింది.

డబ్ల్యూటీఏ ఫైనల్స్ విజేతగా సానియా-హింగిస్ జోడీ

డబ్ల్యూటీఏ ఫైనల్స్ విజేతగా సానియా-హింగిస్ జోడీ

డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జంట 6-4, 6-2 తేడాతో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) పై విజయం సాధించి ఫైనల్స్ కు చేరింది. గంటా 23 నిమిషాల పాటు జరిగిన పోరులో సానియా జోడి పోరాడి తుది పోరుకు అర్హత సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+