భారత్-పాక్ మ్యాచ్.. పాక్ జర్నలిస్ట్‌పై సానియా ఆగ్రహం

భారత టెన్నిస్ స్టార్, పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జా పాకిస్తాన్ జర్నలిస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు రోజుల క్రితమే పాకిస్థాన్ జట్టు మాంచెస్టర్‌కు చేరుకుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

సానియాకు ఆగ్రహం:
శనివారం భర్త షోయబ్ మాలిక్‌తో కలిసి భోజనం చేసేందుకు సానియా బయటకు వెళ్లింది. వారితో పాటు పాక్ ఓపెనర్ ఇమాముల్ హఖ్ కూడా ఉన్నాడు. సానియా వద్దన్నా ఓ పాక్ జర్నలిస్ట్ వీడియో తీసి టీవీలో వార్త ప్రసారం చేశాడు. 'కీలక మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ మానేసి షోయబ్ షికార్లు కొడుతున్నాడు' అని ఆ వార్తలో పేర్కొన్నాడు. దాంతో సానియాకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
చెత్త కథనం జోడించావు:
ట్విట్టర్ ద్వారా తన ఆగ్రహాన్ని జర్నలిస్ట్‌పై ప్రదర్శించింది. 'ఆ వీడియోను మా అనుమతి లేకుండా తీసావు. మా ఏకాంతాన్ని గౌరవించలేదు. మాతో చిన్న పిల్లాడు ఉన్నాడనే విషయాన్ని మరచిపోయావు. వీడియో తీయడమే కాకుండా.. చెత్త కథనం జోడించావు. మేం వెళ్లింది షికారుకు కాదు, భోజనం చేయడానికి. మ్యాచ్ ఓడినా సరే భోజనం చేసే అర్హత అందరికీ ఉంటుంది. అంతా మూర్ఖుల బృందం. మరోసారి మంచి కథనం రాసేందుకు ప్రయత్నించు' అని సానియా రాసుకొచ్చింది.
మితిమీరిన ప్రచారం అక్కర్లేదు:
రెండు రోజుల క్రితం కూడా సానియా ఆగ్రహానికి గురైంది. భారత్-పాక్ మ్యాచ్ నేథ్యంలో ఇరు దేశాల మీడియా చూపిస్తున్న అత్యుత్సాహంపై సానియా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను కించపరుస్తూ రూపొందించిన వీడియోను ఉద్దేశిస్తూ.. మతిలేని ప్రకటనలతో మితిమీరిన ప్రచారం అక్కర్లేదని సానియా సూచించింది.

సర్ఫరాజ్ చెలరేగిపోవాలి:
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఇటావాలో నివసిస్తోన్న మహబూబ్ హసన్ అనే ఓ వృద్ధుడు పాకిస్తాన్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్ ఘన విజయాన్ని సాధించాలని కోరుకున్నాడు. అయితే పాకిస్తాన్ కేప్టెన్ సర్ఫరాజ్ మాత్రం చెలరేగిపోవాలని అతగాడు ఆశిస్తున్నారు. ఎందుకంటే.. ఆ వృద్ధుడు సర్ఫరాజ్ అహ్మద్‌కు స్వయానా మేనమామ. సర్ఫరాజ్ అహ్మద్ తల్లి మహబూబ్ హసన్‌కు సోదరి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications