సోదరి అప్పగింతల వేళ కన్నీటి పర్యంతమైన సానియా మిర్జా (వీడియో)

హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా పెళ్లికి సంబంధించిన ప్రమోషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవలే టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసద్‌తో ఆనమ్ మిర్జా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 11న జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు హాజరయ్యారు.
తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన వీడియోని ఆనమ్ మిర్జా తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ "ఒకే ఒక్కసారి జీవితం నీకు అద్భుత క్షణాలను అందిస్తుంది. ఇది మా పెళ్లి వీడియో" అని కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఆనమ్-అసద్‌ల వెడ్డింగ్‌ని డేమి ఫిల్మ్స్ షూట్ చేశారు.
ఈ వీడియోలో ఆనమ్-అసద్‌లతో పాటు సానియా మిర్జా, ఆమె కుమారుడు ఇజహాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆనమ్ మిర్జా అప్పగింతల సమయంలో "ఆనమ్-అసద్‌లు తమ ప్రేమను పెళ్లిదాకా తీసుకువచ్చారు. ఇప్పుడు నేను, అమ్మా, నాన్నా.. ముఖ్యంగా ఇజ్జూ నిన్ను చాలా మిస్సవుతాం" అంటూ సానియా భావోద్వేగానికి లోనయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications