పెళ్లైన పదేళ్ల తర్వాత పరిస్థితి ఇదీ.. షోయబ్ చెవి మెలిపెడుతున్న సానియా!!

హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ సీనియర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్‌లు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. షోయబ్-సానియాల వివాహం జరిగి గత ఆదివారానికి (ఏప్రిల్ 12) పదేళ్లయింది. తమ పదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సానియా తన భర్త షోయబ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆ ఫొటోలకు సానియా సరదా కామెంట్స్ పెట్టింది.

షోయబ్ చెవిని మెలిపెడుతూ:
షోయబ్ మాలిక్‌కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. పెళ్లైన పదేళ్ల తర్వాత పరిస్థితి ఇదీ. 'మనం ఊహించింది వర్సెస్ ప్రస్తుతం జరుగుతున్నది' అని రెండు ఫొటోలను సానియా మీర్జా ఉంచింది. మొదటి ఫొటోలో ఇద్దరూ ఓ ఫంక్షన్‌లో సన్నిహితంగా దిగిన ఫొటో (ఎక్స్‌పెక్టేషన్) ఉండగా.. రెండో దాంట్లో మాత్రం షోయబ్ చెవిని సానియా మెలిపెడుతూ అతడిని అదుపులో ఉంచుకున్న (రియాలిటీ) సంకేతాన్ని ఇచ్చింది.

సానియాకు షోయబ్ విషెస్:
ఫొటోలలో సానియా మీర్జా మెరూన్ కలర్ లెహంగా చోలి వేసుకుని సాంప్రదాయ ఆభరణాలను ధరించి అందంగా ఉంది. మరోవైపు షోయబ్ మాలిక్ కూడా షేర్వాణీలో మెరిశాడు. ఇక త్రోబాక్ చిత్రంతో ఇన్‌స్టాగ్రామ్‌లో సానియాకు కూడా షోయబ్ విషెస్ చెప్పాడు. 'సానియా.. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎప్పుడూ నవ్వుతూ అలానే ఉందాం' అని షోయబ్ పేర్కొన్నాడు. దియా మీర్జా, నీతి మోహన్, జెనెలియా డిసౌజాతో సహా సానియా కుటుంబం సభ్యులు ఇద్దరికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సాంప్రదాయ పద్దతిలో పెళ్లి:
సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌ల వివాహం 2010 ఏప్రిల్ 12న జరిగింది. హైదరాబాద్‌లో సాంప్రదాయ పద్దతిలో షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా వివాహం చేసుకుంది. వీరికి 2018లో ఓ కుమారుడు జన్మించాడు. అహాన్ని పేరు ఇజాన్ మీర్జా మాలిక్. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ సానియా తన ముద్దుల తనయుడు ఇజాన్‌తో సరదా సమయం గడుపుతోంది. తాజాగా సానియా తన ట్వీటర్ అకౌంట్‌లో కుమారుడు ఇజాన్ ఫొటోను పోస్ట్ చేసింది. చేతిలో టెన్నిస్ రాకెట్‌ను పట్టుకుని ఉన్న ఇజాన్ ఫోటో పెట్టిన సానియా.. 'అసలు ఇదంతా ఏంటీ అని ఇజాన్ ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది' అంటూ కామెంట్ రాసుకొచ్చింది.

ఈ ఫొటోలోనే నా జీవితం:
ఇటీవల ఫెడ్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా సానియా తన కొడుకును కూడా అక్కడకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి ఓ ఫొటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ... 'ఈ ఫొటోలోనే నా జీవితం. నాకు మరో మార్గం లేదు. నా పని నేను ఉత్తమంగా చేయడానికి ఇజాన్ నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు' అనే క్యాప్షన్ సానియా పెట్టింది. ఇజానే తన సర్వస్వం అని సానియా చెప్పకనే చెప్పింది. సానియా తల్లిగా కొడుకు సంరక్షణతో పాటు కెరీర్‌ను కూడా బాగా సమన్వయం చేసుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications