Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sania Mirza: CSK మాజీ ప్లేయర్‌తో సానియా మీర్జా డిన్నర్ డేట్! - నా బ్యూటీ సీక్రెట్ ఇదేనంటూ పోస్ట్

Sania Mirza: పాకిస్థాన్ క్రికెటర్‌ షోయబ్ మాలిక్‌తో వివాహ బంధానికి ముగింపు పలికిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మళ్లీ తన జీవితంలో బిజీగా ఉంటూ ముందుకెళ్తోంది. దుబాయ్ లో ఉంటోన్న ఆమె మరో పెళ్లి కూడా చేసుకోనున్నట్లు కొంతకాలంగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా భారత్ కు చెందిన ఓ స్టార్ క్రికెటర్.. దుబాయ్ లో ఆమెను కలిశాడు. ఇద్దరు కలిసి లంచ్, డిన్నర్ కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సానియానే స్వయంగా పోస్ట్ చేసి తన బ్యూటీ సీక్రెట్ గురించి తెలిపింది.

ఇంతకీ అడెవరంటే?
ఆ క్రికెటర్ మరెవరో కాదు.. టీమిండియాకు, ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన రాబిన్ ఉతప్ప. వీరిద్దరిది ఇప్పటి స్నేహం కాదు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. వీరిద్దరి ఫ్యామిలీల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. తాజాగా వీరిద్దరి కుటంబాలు దుబాయ్ లో కలిశాయి. వీరితో పాటు ఇతర ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందరూ తమ పిల్లలతో కలిసి ఓ రెస్టారెంట్ లో లంచ్, డిన్నర్ కూడా చేసినట్లు ఈ ఫొటోలు చూస్తే తెలుస్తోంది.

Sania Mirza dinner with India cricketer robin Uthappa and shares her beauty secret

నా బ్యూటీ సీక్రెట్ ఇదే..
ఇంకా ఈ ఫొటోల్లో సానియా ఎంతో అందంగా, ఆనందంగా కనిపించింది. అలానే తన స్కిన్ బ్యూటీ సీక్రెట్ కూడా తెలిపింది సానియా. "వ్యాయామం చేయడం నుంచి కుటుంబంతో సమయం గడపడం వరకు నా చర్మాన్ని కాపాడుతూ, నన్ను ప్రకాశవంతంగా ఉంచుతుంది. ఇలా ఉండటం ప్రతి ఉదయం నా దినచర్యలో భాగం." అని రాసుకొచ్చింది.

Story first published: Friday, February 28, 2025, 17:32 [IST]
Other articles published on Feb 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+