Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపిఎల్ 4లో డెక్కన్ ఛార్జర్స్ ఈసారైనా తన సత్తా చాటుతుందా?

Deccan Chargers
ఐపీఎల్-4లో డెక్కన్ చార్జర్స్ జట్టుకు నాయుకత్వం వహించే అవకాశం కుమార సంగక్కర దక్కించుకున్నాడు. జట్టును వురోసారి విజేతగా నిలిపేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని అతను చెప్పాడు. డీసీ జట్టు గత నాలుగు రోజులుగా నగరంలోనే ఉండగా, కొంత ఆలస్యంగా బుధవారం సంగక్కర హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ సందర్బంలో కుమార సంగక్కర మాట్లాడుతూ 'డెక్కన్ జట్టునుంచి అభివూనులు చాలా ఆశిస్తున్నారు. ప్రపంచకప్‌నుంచి తిరిగొచ్చి ఐపీఎల్‌లో ఆడటం ఆనందంగా ఉంది. ఈ ఏడాది జట్టుగా మేం రాణిస్తావుని నాకు గట్టి నవ్ముకం ఉంది" అని లంక వూజీ కెప్టెన్ వ్యాఖ్యానించాడు. కొత్త బాధ్యతలు ఇబ్బందికాదని, ఇక వ్యూచ్‌లు గెలవటమే తరువాయని సంగక్కర పేర్కొన్నాడు. శీలంక వన్డే, టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవటం ఐపీఎల్‌లో తనపై వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావం చూపించదని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు.

నిరుడు 21 వికెట్లతో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచి, వూదారంగు టోపీ (పర్పుల్‌ క్యాప్‌) దక్కించుకున్న ఆటగాడు ప్రజ్ఞాన్‌ ఓజా. ఈ హైదరాబాద్‌ ఎడమ చేతివాటం స్పిన్నర్‌ను రూ.2.3 కోట్లకు డెక్కన్‌ ఛార్జర్స్‌ కొనుక్కుంది. గిల్‌క్రిస్ట్‌, రోహిత్‌ శర్మ లాంటి ఆటగాళ్ళను కాదనుకున్న ఛార్జర్స్‌ ఓజాపై నమ్మకముంచింది. మరోసారి 'పర్పుల్‌' ప్రదర్శన కనబరుస్తాడని ఆశలు పెట్టుకుంది. ఛార్జర్స్‌ తరఫున మూడు సీజన్లలోనూ ఆడిన ఓజా 44 మ్యాచ్‌ల్లో 21.22 సగటుతో 50 వికెట్లు తీశాడు. పూర్తిస్థాయి టెస్టు ఆటగాడిగా మారిన ఓజాకు ఈసారి టోపీ దక్కుతుందో లేదో చూడాలి.

హైదరాబాద్‌ రంజీ కెప్టెన్‌ రవితేజ, మాజీ కెప్టెన్‌ అర్జున్‌యాదవ్‌, అండర్‌-19 క్రికెటర్లు ఆశిష్‌రెడ్డి, ఆకాశ్‌ భండారీ ఛార్జర్స్‌కు స్థానిక ఆటగాళ్ళు. ఐపీఎల్‌ తొలి సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన రవితేజ 18.17 సగటుతో 109 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన రవితేజను ఓపెనర్‌గా లేదా మూడో నెంబర్‌లో బరిలోకి దించాలని ఛార్జర్స్‌ భావిస్తోంది.

కుడి చేతివాటం మీడియం పేసర్‌, బ్యాట్స్‌మన్‌ ఆశిష్‌రెడ్డి ఆశ్చర్యకర ప్యాకేజీ. నిరుడు ఛార్జర్స్‌కు ఎంపికైనా తుది జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. ఈసారి అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. 17 ఏళ్ళ లెగ్‌స్పిన్నర్‌ ఆకాశ్‌ భండారీ అండర్‌-19 విభాగంలో హైదరాబాద్‌ తరఫున అత్యుత్తమ బౌలర్‌. ఇతను బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లోనూ మెరుగైన ఆటగాడే.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+