
మిగతా దేశాల క్రికెటర్లకు అదే ఫీజు
అంతేకాదు భారత్, ఆస్ట్రేలియాల్లో టెస్టు క్రికెటర్లకు ఇచ్చిన ఫీజునే మిగతా దేశాల క్రికెటర్లకు కూడా ఇవ్వాలన్న అభిప్రాయాన్ని సంగక్కర వ్యక్తం చేశాడు. టీ20 ఫార్మాట్ వల్ల క్రికెట్ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిందని, అమెరికా, చైనా లాంటి దేశాలకు క్రికెట్‌ను పరిచయం చేయాలంటే టీ20 ఫార్మాట్ అన్ని విధాలా సరైందని చెప్పుకొచ్చాడు.

గతేడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన సంగక్కర
అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఐదో స్థానంలో ఉన్న కుమార సంగక్కర గతేడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా దేశవాళీ టీ20 ప్రాంఛైజీల తరుపున ఆడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంగక్కర ఆరువారాల పాటు జరిగే హాంకాంగ్ టీ20 బ్లిట్జ్ టోర్నీలో ఆడనున్నాడు.

టీ20 ఫార్మాట్ వల్ల క్రికెట్లో కొత్తశకం మొదలైంది
ఈ నేపథ్యంలో ఏఎఫ్‌పీకి ఇచ్చిన ఇంటర్యూలో 'టీ20 ఫార్మాట్ వల్ల క్రికెట్లో కొత్తశకం మొదలైంది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌కు అదొక మూల స్థంభంలా నిలిచింది. కానీ దానివల్ల యువ క్రికెటర్లు దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా కేవలం టీ20 లీగ్‌లే ఆడే ప్రమాదమూ ఉంది. క్రికెట్లో దేశాల మధ్య తేడాల గురించి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది' అని సంగక్కర అన్నాడు.

టెస్టు మ్యాచ్ ఫీజులో అంతరం ఎక్కువే
'ఇక్కడ వివిధ అంశాలను ప్రస్తావించుకోవాల్సి ఉంది. ముఖ్యంగా టెస్టు మ్యాచ్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఆ అంతరం ఇంకా ఎక్కువగా ఉంది. టెస్టు ఆటగాళ్లందరికీ ఒకే రకమైన కనీస మ్యాచ్ ఫీజు చెల్లించలేరా? భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాలు తమ ఆటగాళ్లకు టెస్టు మ్యాచ్ ఫీజు కింద భారీగానే చెల్లిస్తున్నాయి. ఆ ప్రభావం టెస్టు మ్యాచ్‌లాడే అన్ని దేశాలపైన ఉండదా?' అని సంగక్కర తెలిపాడు.

డే/నైట్, నాలుగు రోజుల టెస్టుల్లాంటి మరిన్ని
టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గకుండా ఉండాలంటే డే/నైట్, నాలుగు రోజుల టెస్టుల్లాంటి మరిన్ని మార్పులు అవసరమని చెప్పాడు. 'ప్రస్తుతం ఆటగాళ్లు, అభిమానులు టెస్టు క్రికెట్ గురించి ఏమనుకుంటున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ బలంగానే ఉంది. టెస్టు, వన్డే, టీ20లు ఇలా దేనిలోనైనా దేశానికి ప్రాతినిధ్యం వహించడమే ఆటగాళ్లకు గొప్ప విషయం' అని సంగక్కర అన్నాడు.

క్రిక్‌ఇన్ఫో సర్వే ప్రకారం స్మీత్‌కు రూ. 9.4 కోట్లు
ఇదిలా ఉంటే గతేడాది ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మీత్ టెస్టు మ్యాచ్ ఫీజు కింద రూ.9.4 కోట్లు అందుకోగా.. జింబాబ్వే కెప్టెన్ క్రీమర్‌కు కేవలం రూ.55 లక్షలు మాత్రమే లభించింది. దీంతో క్రికెట్‌లో పేద దేశాలకు చెందిన క్రికెటర్లు తమ దేశం తరపున టెస్టు మ్యాచ్ ఆడటం కన్నా టీ20 లీగ్‌ల్లోనే ఎక్కువ సంపాదిస్తున్నారు.


Click it and Unblock the Notifications











