Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సందీప్‌, సర్దారా కొరడా ఝుళిపించిన హాకీ ఇండియా

Sandeep and Sardara
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ) కొరడా ఝుళిపించింది. పదేపదే క్రమశిక్షణ తప్పినందుకు ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు సందీప్‌ సింగ్‌, సర్దారా సింగ్‌లపై రెండేళ్ల నిషేధం విధించింది. శనివారం ఇక్కడ సుదీర్ఘంగా సమావేశమైన అనంతరం హెచ్‌ఐ ఈ నిర్ణయం తీసుకుంది. సమావేశానికి కార్యదర్శి నరిందర్‌ బత్రా సహా అనేకమంది ముఖ్యులు హాజరయ్యారు. సందీప్‌, సర్దారాలను కూడా సమావేశానికి పిలిచారు. ఆటగాళ్లకు నిషేధంపై అప్పీలు చేసుకునే హక్కు ఉందని, అందుకు వారికి 30 రోజుల సమయం ఇచ్చామని బత్రా చెప్పాడు. ''సందీప్‌, సర్దారాల విషయాన్ని చర్చించడానికి ఈ రోజు సమావేశమయ్యాం. ఈ ఇద్దరు కోచ్‌కు చెప్పకుండా ఆగస్టు 23న బెంగళూరు శిబిరాన్ని విడిచి వెళ్లారు. విషయాన్ని సవివరంగా చర్చించాం.

ఆటగాళ్లకు కూడా వారి వాదన వినిపించే అవకాశం ఇచ్చాం. వీళ్లిలా (క్రమశిక్షణ ఉల్లంఘించడం) చేయడం ఆరు నెలల్లో ఇది మూడోసారి. ఈ ఆటగాళ్లపై చర్యలు అవసరమని భావించాం. రెండేళ్ల నిషేధం విధించాం. ఈ సమయంలో హెచ్‌ఐ, ఎఫ్‌హెచ్‌ఐ టోర్నీల్లో వారు పాల్గొనలేరు. ఇది ఏకగ్రీవ నిర్ణయం. కానీ వారు దీనిపై 30 రోజుల్లో అప్పీలు చేసుకోవచ్చు'' అని బత్రా వివరించాడు. ''నిషేధం గురించి తెలిసింది. ఎలా స్పందించాలో తెలియట్లేదు. నేనేమీ మాట్లాడే స్థితిలో లేను'' అని సందీప్‌ అన్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+