Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఐసీసీది తెలివి తక్కువ నిర్ణయం.. టెస్టు క్రికెట్‌లో మార్పులేమీ చేయొద్దు'

Sandeep Patil, Ian Botham, Mahela Jayawardene Not in Favour of Four-Day Test Matches

ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నాలుగు రోజుల టెస్టు క్రికెట్‌ ప్రతిపాదనను వ్యతిరేకించే సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. 2023 నుంచి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు అమలు చేయాలని ఐసీసీ భావిస్తుండగా.. ఇప్పటికే ఈ ప్రతిపాదనను విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, రికీ పాటింగ్, మెక్‌గ్రాత్‌ తప్పుబట్టారు. ఇప్పుడు ఈ జాబితాలో మాజీ క్రికెటర్లు సందీప్‌ పాటిల్‌, మహేళ జయవర్ధనె, ఇయాన్‌ బోథమ్‌లు కూడా చేరిపోయారు.

ఐసీసీది తెలివి తక్కువ నిర్ణయం:

ఐసీసీది తెలివి తక్కువ నిర్ణయం:

ఐసీసీ త్వరలో టెస్టుల సమయం కుదించడంపై చర్చించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సందీప్‌ పాటిల్‌ స్పందించారు. నాలుగు రోజుల టెస్టులను వ్యతిరేకిస్తున్నా. ఐసీసీది తెలివి తక్కువ నిర్ణయంగా భావిస్తున్నా అని అన్నారు. 'ఒక క్రికెటర్‌ నైపుణ్యాన్ని పరీక్షించేదే టెస్టు క్రికెట్‌. సచిన్‌ అన్నట్టు ప్రతి రోజు క్రికెటర్ల ప్రతిభను పరీక్షిస్తుంది. సుదీర్ఘ ఫార్మాట్‌కు ఉన్న లక్షణాలు, స్వభావాలను చంపేయొద్దు' అని పాటిల్‌ సూచించారు.

డే/నైట్‌ టెస్టులపై నో కామెంట్:

డే/నైట్‌ టెస్టులపై నో కామెంట్:

'భారత్‌ డే/నైట్‌ టెస్టును ఈ మధ్యే ఆడటం ఆరంభించడం ఆనందంగా ఉంది. అయితే డే/నైట్‌ టెస్టుల గురించి ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్యలు చేయబోను. కోల్‌కతాలో నిర్వహించన మ్యాచ్‌ విజయవంతమైంది. డే/నైట్‌ టెస్టులతో ప్రయోజనం ఉంటుంది' అని పాటిల్‌ అన్నారు. రంజీ ట్రోఫీలో ముంబై ప్రస్తుత ప్రదర్శన గురించి పాటిల్ విచారం వ్యక్తం చేసారు. 1980-1986 మధ్య కాలంలో పాటిల్ 29 టెస్టులు ఆడి 1,588 పరుగులు బాదారు. 45 వన్డేలలో 1,005 పరుగులు చేశారు.

మార్పులేమీ చేయొద్దు:

మార్పులేమీ చేయొద్దు:

నాలుగు రోజుల టెస్టులకు తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నానని శ్రీలంక మాజీ కెప్టెన్, ఐసీసీ కమిటీ సభ్యుడు మహేళా జయవర్ధనె పేర్కొన్నారు. 'టెస్టు క్రికెట్‌లో మార్పులేమీ చేయొద్దు. సుదీర్ఘ ఫార్మాట్‌ను లాభసాటిగా మార్చేందుకు డే/నైట్‌ టెస్టుతో ముందడుగు వేశారు. అది మంచి నిర్ణయం. రోజుల సమయాన్ని మాత్రం కుదించొద్దు' అని అన్నారు.

ఒంటరిగా వదిలేయండి:

ఒంటరిగా వదిలేయండి:

ఇంగ్లాండ్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఇయాన్‌ బోథమ్‌ మాట్లాడుతూ... 'అత్యుత్తమ క్రికెట్‌ ఫార్మాట్‌ను ఒంటరిగా వదిలేయండి. అసలైన క్రికెటర్ల నైపుణ్యం, ధైర్యం, సహనం, సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నిజమైన క్రికెట్‌ ఇదే. దాని అలా వదిలేయండి. దక్షిణాఫ్రికాపై రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ బాగా ఆడింది. ఐదు రోజుల క్రికెట్‌ను చక్కగా ముగించింది' అని చెప్పుకొచ్చారు.

Story first published: Thursday, January 9, 2020, 11:22 [IST]
Other articles published on Jan 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+